Jr NTR: హృతిక్ తారక్ పాత్రల పేర్లు రివీల్.. రిలీజ్ గురించి మళ్లీ క్లారిటీ రావడంతో?

  • September 1, 2023 / 06:12 PM IST

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ తర్వాత కొంతకాలం షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ కు ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడంతో పాటు టార్గెట్ కు అనుగుణంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. ఎన్టీఆర్ దేవర మూవీ 2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

వార్2 సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. 2025 సంవత్సరం జనవరి 24వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని గతంలో ప్రచారం జరగగా ఆ ప్రచారమే నిజమైందని తెలుస్తోంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కబీర్ అనే పాత్రలో కనిపించనుండగా తారక్ నజీర్ అనే రోల్ లో కనిపించనున్నారని బోగట్టా. అయాన్ ముఖర్జీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో, భారీ రేంజ్ లో తెరకెక్కించనున్నారు.

పది నెలల గ్యాప్ లో ఎన్టీఆర్ (Jr NTR) నటించిన రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండటం అభిమానులకు కూడా తీపికబురు అనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా పూర్తైన వెంటనే మరో సినిమా షూటింగ్ లో పాల్గొనేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. తారక్ సినిమాల బడ్జెట్ల లెక్కలు సైతం గత కొన్నేళ్లలో మారిపోయాయి. తారక్ ప్రతి సినిమా 300 కోట్ల రూపాయల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

దేవర సినిమాతో ఇతర భాషల్లో తారక్ మార్కెట్ ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టత రానుంది. తను హీరోగా తెరకెక్కుతున్న ప్రతి సినిమా అభిమానులను నిరాశ పరచకుండా ఉండేలా ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తున్న తారక్ తన సినిమాలకు రెమ్యునరేషన్లకు బదులుగా లాభాలు తీసుకుంటున్నారు. నవ్యత ఉన్న కథలకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus