Jr NTR: తారక్ లోని క్రూరత్వాన్ని కొరటాల చూపించనున్నారా?

జూనియర్ ఎన్టీఆర్ 30 మూవీ అంతకంతకూ ఆలస్యమవుతున్నా ఆ ఆలస్యానికి తగ్గ రిజల్ట్ కచ్చితంగా వస్తుందని ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోని ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తారక్ పాత్ర ఎవరూ ఊహించని రేంజ్ లో ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమాలో తారక్ లోని క్రూరత్వాన్ని కొరటాల శివ చూపించనున్నారని బోగట్టా. సినిమాలో ఎన్టీఆర్ ను చాలా సమయం పాటు కూల్ గా చూపించి

షాకింగ్ ట్విస్ట్ తో తారక్ లోని మరో యాంగిల్ ను కొరటాల శివ రివీల్ చేస్తారని సమాచారం అందుతోంది. తారక్ కు ఇప్పటికే నటుడిగా మంచి పేరు ఉండగా ఆ పేరును మరింత పెంచేలా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి మైథలాజికల్ టచ్ ఉండనుందని తెలుస్తోంది. రెండు కోణాలలో తారక్ పాత్ర ఉండనుందనే వార్త అభిమానులకు కిక్ ఇస్తుండగా ఇప్పటివరకు ఎవ్వరూ చూడని తరహా కథ, కథనాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం.

నీటిలో తారక్ చేసే యాక్షన్ సీక్వెన్స్ లు మామూలుగా ఉండవని తెలుస్తోంది. సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలకు ఢోకా ఉండదని మాస్ ప్రేక్షకులు విజిల్స్ వేసేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. షూటింగ్ మొదలుకాకుండానే ఈ సినిమాకు భారీ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.

పాన్ ఇండియా నటులను ఈ సినిమాలో ఎంపిక చేస్తుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. తారక్ కు జోడీగా నటించే అవకాశం కోసం చాలామంది హీరోయిన్లు ఎదురుచూస్తుండగా ఆ లక్కీ ఛాన్స్ ను అందుకునే లక్కీ బ్యూటీ ఎవరో మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus