Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ సందీప్ వంగా కాంబోలో సినిమా అప్పుడేనా?

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా మరో మూడేళ్ల వరకు బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఫిక్స్ అయ్యాయి. ప్రభాస్, బన్నీలతో సందీప్ ప్రాజెక్ట్ లు తెరకెక్కుతున్నాయి. అయితే ఈ సినిమాలు పూర్తైన తర్వాత ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ దిశగా అడుగులు వేస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ సంస్థ దగ్గర ఇప్పటికే తారక్ డేట్లు ఉన్నాయని సందీప్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఈ కాంబినేషన్ లో సినిమా కష్టం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

(Jr NTR) ఎన్టీఆర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో సినిమా వస్తే మామూలుగా ఉండదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తారక్ సందీప్ కెరీర్ పరంగా మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు దేవర గ్లింప్స్ గురించి ఒక అప్ డేట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. జనవరి నెలలో దేవర సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కచ్చితంగా రానున్నాయని సమాచారం అందుతోంది.

దేవర మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. డెవిల్, దేవర సినిమాలకు మధ్య కనీసం మూడు నెలల గ్యాప్ ఉండాలని మరి కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దేవర మూవీ కమర్షియల్ గా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

సైఫ్ అలీ ఖాన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా తర్వాత సైఫ్ అలీ ఖాన్ మరింత బిజీ కావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus