Jr NTR, Shankar: ఆ బ్యానర్ లో తారక్ మూవీ తెరకెక్కనుందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కితే బాగుంటుందని తారక్ అభిమానులతో పాటు శంకర్ అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ప్రస్తుతం చరణ్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న శంకర్ ఈ సినిమా తర్వాత తారక్ తో సినిమాను తెరకెక్కించే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తారక్ తర్వాత సినిమాలు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఫిక్స్ కాగా ఈ జాబితాలో శంకర్ కూడా చేరతారేమో చూడాల్సి ఉంది.

శంకర్ తారక్ కాంబినేషన్ లో సినిమా అంటే పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుందని జరుగుతున్న ప్రచారం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లైకా ప్రొడక్షన్స్ కు, శంకర్ కు భారతీయుడు2 సినిమా విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. భారతీయుడు2 షూటింగ్ ను శంకర్ ఎప్పటికి పూర్తి చేస్తారనే ప్రశ్నకు సంబంధించి క్లారిటీ లేదనే సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చిన క్రేజ్ ను మరింత పెంచే విధంగా తర్వాత సినిమాలు ఉండాలని తారక్ కోరుకుంటున్నారు. తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనున్నాయి. ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా రిలీజయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని తారక్ భావిస్తున్నారు. తారక్ ఒక్కో సినిమాకు ప్రస్తుతం 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

మరోవైపు మరో వారం రోజుల్లో తారక్ పుట్టినరోజు కావడంతో ఆరోజు తారక్ కొత్త సినిమాలకు సంబంధించి అదిరిపోయే అప్ డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూన్ నెల నుంచి తారక్ కొరటాల శివ కాంబో మూవీ షూట్ మొదలుకానుండగా ఇకపై వేగంగా సినిమాలు చేయాలని తారక్ భావిస్తున్నారు. భవిష్యత్తులో రాజమౌళి తారక్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus