Jr NTR: తారక్‌ క్యాజువల్‌గా వేసిన చొక్కా రేటు ధర.. వామ్మో ఏంటా లెక్క?

సినిమా సెలబ్రిటీలు ధరించే దుస్తులు, వాడే వస్తువుల ధరలు ఎక్కువగా ఉండటం పెద్ద విషయం కాదు. గతంలో చాలా సందర్భాల్లో, చాలామంది నటుల విషయంలో ఈ చర్చ జరిగింది. వాచీలు, కార్లు, జాకెట్ల అంటూ హీరోల గురించి.. డ్రెస్సులు, చీరలు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఓ సాధారణ చొక్కా గురించి మాట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా? ఏముంది సాధారణ చొక్కా పెద్ద ధర ఉండదు కదా అందుకే మాట్లాడుకొని ఉండరు అనొచ్చు.

Jr NTR

అయితే సాధారణ చొక్కాలా కనిపించినా ఓ డ్రెస్‌ ధర ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం తారక్‌ (Jr NTR) తన ఫ్యామిలీతో దుబాయి ట్రిప్‌ వెళ్లినట్లు సమాచారం. అక్కడ తారక్‌ తన అభిమానులతో దిగిన కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అందులో తారక్ స్టైలిష్ లుక్‌లో అప్పటిలాగే అదరగొట్టాడు. ఈ క్రమంలో తారక్‌ వేసుకున్న దుస్తుల మీద అందరి దృష్టి పడింది. సింపుల్‌గా నీలిరంగు పూల చొక్కాను తారక్‌ వేసుకున్నాడు.

చాలా క్యాజువల్‌గా కనిపించిన ఆ షర్ట్ ధర ధర రూ.85,000 అని తెలుస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్ బ్రాండ్‌కి చెందిన చొక్కా అది అని తెలుస్తోంది. దీంతో చొక్కాకే అంత రేటా అని ఆశ్చర్యపోతున్నారు. గతంలో కూడా తారక్‌ ఇలా కాస్ట్‌లీ వస్తువులతో కనిపించాడు. వాచీలు అంటే తారక్‌కు చాలా ఇష్టం. ఇక హూడీలు, జాకెట్స్‌ కూడా కొన్నిసార్లు కాస్ట్‌లీవే వేసుకుంటూ వచ్చారు. అయితే చొక్కా కూడా అంత రేటు పెట్టి కొంటారా అని అనుకుంటున్నారు.

ఇక తారక్‌ సినిమాల విషయానికొస్తే మొన్నటివరకు ‘వార్‌ 2’ (War 2)  సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు రెస్ట్‌ మోడ్‌లోకి వచ్చాడు. వచ్చే వారం నుండి ప్రశాంత్‌ నీల్‌  (Prashanth Neel) సినిమా సెట్స్‌లో తారక్‌ అడుగుపెడతాడు. ఈ షెడ్యూల్‌లో తారక్‌ మీద యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కిస్తారు అని చెబుతున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుంది అంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus