యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండమే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెరిగింది. ఎన్టీఆర్, చరణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటూ ఆర్ఆర్ఆర్ పై అంచనాలను పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది.
అతి త్వరలో హైదరాబాద్ లో కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని బోగట్టా. మీడియా సమావేశంలో భాగంగా ఎన్టీఆర్ కు బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురుకాగా ఎన్టీఆర్ ఆ ప్రశ్నకు సమాధానంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్ట్రెయిట్ హిందీ సినిమాలో ఎప్పుడు నటిస్తారనే ప్రశ్నకు బాలీవుడ్ ఛాన్స్ ల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తారక్ అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైన తర్వాత పరిస్థితులు మారతాయని తారక్ చెప్పుకొచ్చారు.
కొన్నేళ్ల క్రితమే రామ్ చరణ్ జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దాదాపుగా 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ తెరకెక్కగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో నటించడంతో ప్రేక్షకులు ఈ సినిమా ఫలితం విషయంలో నమ్మకంతో ఉన్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దానయ్య ఈ సినిమాను నిర్మించారు.
రిలీజ్ కు ముందే నిర్మాతకు భారీగా లాభాలను అందించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్, చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. స్నేహం ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.