Jr NTR: చరణ్ కు గట్టి పోటీ ఇస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. ఏమైందంటే?

ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలైన తర్వాత రామ్ చరణ్ వరుసగా సినిమాల షూటింగ్ లతో బిజీ కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఏడాది పాటు షూటింగ్ లకు దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్30 స్క్రిప్ట్ వర్క్ ఆలస్యం కావడం, ఇతర కారణాల వల్ల తారక్ షూటింగ్ లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది మార్చి నెల చివరి వారం నుంచి తారక్ వరుస షూటింగ్ లతో బిజీ అవుతున్నారు.

ఎన్టీఆర్30 ఫస్ట్ షెడ్యూల్ చాలా రోజుల క్రితమే పూర్తైంది. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్ డేట్స్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ఈ సినిమాతో రెట్టింపు అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సోలో హీరోగా తారక్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ సినిమాలో నటించే నటీనటులు, పని చేసే టెక్నీషియన్స్ విషయంలో తారక్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

వార్2 సినిమాను సైతం (Jr NTR) తారక్ ఈ ఏడాదే పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. చరణ్ రెండు సినిమాల షూటింగ్ లు పూర్తయ్యే సమయంలోగా తారక్ రెండు సినిమాలు కూడా పూర్తి కానున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్ కు షూటింగ్ ల విషయంలో తారక్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. చరణ్, తారక్ కాంబోలో ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ వస్తుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

రాజమౌళి స్పందిస్తే మాత్రమే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. తారక్, చరణ్ మధ్య మంచి స్నేహ బంధం ఉందనే సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య స్నేహం కలకాలం కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మే 20వ తేదీన ఎన్టీఆర్30 నుంచి షాకింగ్ అప్ డేట్స్ రానున్నాయని ఆ అప్ డేట్స్ ఫ్యాన్స్ ను కచ్చితంగా మెప్పించే విధంగా ఉండనున్నాయని తెలుస్తోంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus