ఎన్టీఆర్ వంటి పాన్ ఇండియా స్టార్‌ను జనసమూహంలో చూడటం ఎంతో అరుదైన విషయం. స్కాట్లాండ్‌లో ఎడిన్‌బర్గ్ క్రిస్మస్ మార్కెట్‌లో, సాధారణ జనం మధ్య లో తారక్ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అనుకోకుండా తీసిన ఈ వీడియోలో ఎన్టీఆర్ సింపుల్‌గా నడుచుకుంటూ వెళ్తుండటం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
సాధారణంగా పెద్ద స్టార్స్ బయట తిరగడానికి ఇష్టపడరు. మరీ ముఖ్యంగా భారతీయ సెలబ్రిటీలకు, విదేశాల్లో రోడ్ల మీద సింపుల్‌గా కనిపించడం అసాధారణం. కానీ తారక్ అదే సాధ్యమయ్యేలా చేశాడు. ఎడిన్‌బర్గ్ క్రిస్మస్ మార్కెట్‌లో రహదారిపై నడుస్తూ ఉన్న ఎన్టీఆర్ వీడియో చూసిన అభిమానులు, ‘‘తారక్ నిజమైన కామన్ మ్యాన్’’ అంటూ ప్రశంసిస్తున్నారు. సామాన్యుడిలా ఉండే తారక్ వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
ఈ వీడియో చూసినవారు ‘‘ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించిన స్టార్ ఇంత సింపుల్‌గా ఉంటారా?’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఈ వీడియోలో ఎన్టీఆర్‌ని గుర్తించిన స్కాట్లాండ్‌లోని ఆ ఇన్ఫ్లూయెన్సర్, ‘‘ఇతనొక గ్లోబల్ స్టార్’’ అంటూ తన ఫాలోవర్లకు వివరించాడు. ఈ వీడియో చూసినవారిలో చాలా మంది ఎన్టీఆర్ సింప్లిసిటీకి ఫిదా అయిపోయారు.
ఇక కెరీర్ విషయానికి వస్తే, ఎన్టీఆర్ ప్రస్తుతం “వార్ 2” షూటింగ్‌లో ఉన్నాడు. అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం కసరత్తులు మొదలుపెట్టనున్నాడు. “డ్రాగన్” అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయని సమాచారం. 2026లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.