మహానటుడు నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీని తారక్ వీడనున్నారా? సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారా?.. అంటే.. అవుననే సమాధానం ఇస్తున్నాయి టాలీవుడ్ వర్గాలు. రామోజీ ఫిలిం సిటీలో లవ కుశ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఐదు రోజుల ( ఏప్రిల్ 11 ) క్రితం ‘నవ భారత్ నేషనల్ పార్టీ’ పేరుని రిజిస్టర్ చేయించినట్లుగా ఆధారాలు దొరికాయి. ఆ పార్టీ లెటర్ హెడ్ ఒకటి సోషల్ మీడియాలో జోరుగా విహరిస్తోంది. అయితే నిజంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టారా? లేకుంటే అభిమానులు పార్టీ పెట్టాలని కోరికను ఈ రూపంలో బయటపెట్టారా? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
తారక్ కొన్నేళ్ళక్రితం తెలుగుదేశం పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో పార్టీ వ్యవహారాల్లో తలదూర్చడం లేదు. కనీసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన దాఖలాలు లేవు. పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి అడుగు పెడుతున్నారు. ఈ అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ సమయంలో యంగ్ టైగర్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని సినీ, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి దీనిపై ఎన్టీఆర్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.