Jr NTR: ‘ఎన్టీఆర్ 32’.. అభిమానులకు గూజ్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఇది..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ఫైనల్ స్టేజిలో ఉంది. మరో 7 వారాలు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇక ఈ చిత్రం పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ తో తారక్ నెక్స్ట్ మూవీ ఉంటుంది అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా త్రివిక్రమ్ ప్లేస్ లోకి కొరటాల శివ వచ్చి చేరాడు.’ఎన్టీఆర్ 30′ ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా.. ‘ఎన్టీఆర్ 31’ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.

ఈ ప్రాజెక్టుల కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్ మరో మాస్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ తో తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ మూవీ ఉంటుందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. ఇటీవల కొరటాల శివ, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో ఎన్టీఆర్ సినిమా ఖరారు కావడంతో .. అట్లీ ప్రాజెక్టు ఇక లేనట్టే అని అంతా అనుకున్నారు.

పైగా అట్లీ కూడా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో మూవీ సెట్ చేసుకున్న నేపథ్యంలో ఇది నిజమే అని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఎన్టీఆర్- అట్లీ ప్రాజెక్టు క్యాన్సిల్ అవ్వలేదు అనేది తాజా సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్సమెంట్ కూడా రాబోతుందట.’వైజయంతి మూవీస్’ వారు ఈ ప్రాజెక్టు ని నిర్మించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus