Jr NTR, Trivikram: మళ్లీ కలిసిన త్రివిక్రమ్ తారక్.. ఈ నెలలోనే షూట్ అంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దాదాపుగా ఒకే సమయంలో సినీ కెరీర్ ను మొదలుపెట్టారు. అయితే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కడానికి 18 సంవత్సరాల సమయం పట్టింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో మరో మూవీ ఫిక్స్ అయినా వేర్వేరు కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.

అయితే త్రివిక్రమ్ తారక్ (Jr NTR) మళ్లీ కలిశారని ఏప్రిల్ 27వ తేదీ నుంచి త్రివిక్రమ్ డైరెక్షన్ లో తారక్ ఒక యాడ్ షూట్ లో పాల్గొననున్నారని బోగట్టా. ఈ యాడ్ షూట్ ద్వారా తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని త్రివిక్రమ్, తారక్ చెప్పకనే చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ తారక్ రెమ్యునరేషన్లు ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉన్నాయి.

డిమాండ్ కు అనుగుణంగా వీళ్లిద్దరూ పారితోషికాలు తీసుకుంటున్నారు. త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించి విజయాలను సాధిస్తే మాత్రం అతని క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తుండగా తారక్ ప్రస్తుతం కొరటాల శివ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు.

తారక్ కెరీర్ పరంగా మూడు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ మూడు సినిమాలు వేటికవే ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుంటానని తారక్ నమ్ముతున్నారు. కెరీర్ విషయంలో తారక్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 100 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న తారక్ కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడుతున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus