కొరటాల సినిమా కోసం తారక్‌ను ఫ్యాన్స్‌ ఎలా విష్‌ చేశారో చూశారా?

హీరోల మీద అభిమానం చూపించడానికి ఫ్యాన్స్‌ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకప్పుడు బ్యానర్లు కట్టడం, కటౌట్లు లేపడం లాంటివి మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సోషల్‌ మీడియా యుగం వచ్చేసరికి… క్యాంపెయిన్స్‌ చేయడం మొదలుపెట్టారు. కొందరు ఇంకొంచెం ముందడుగు వేసి గాలి పటాలు, హాట్‌ ఎయిర్‌ బెలూన్లు ఎగరేయడం లాంటివి చేశారు. ఇదంతా మన దేశంలో విదేశాల్లో అయితే ఇంకొంచెం డిఫరెంట్‌గా, ఘనంగా చేస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఇలాంటి ఓ ప్రయత్నమే చేశారు ఫ్యాన్స్‌.

‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్‌. కొమురం భీమ్‌గా ఆ సినిమాలో తారక్‌ అదరగొట్టాడు. ఇటీవల ఆస్కార్‌ వేడుకల కోసం వెళ్లిన ఎన్టీఆర్‌కు అక్కడి అభిమానులు ఘన స్వాగతం పలికారు కూడా. గతంలోనూ ఎన్టీఆర్‌ విదేశాలకు వెళ్లినప్పుడు ఆ స్థాయిలో స్వాగతం, విషెష్‌ లభించాయి. అయితే ఇప్పుడు కొత్త సినిమా స్టార్ట్‌ చేయబోతున్న తారక్‌కు మంచి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు అమెరికా ఫ్యాన్స్‌. ఈ మేరకు వారు రూపొందించిన సర్‌ప్రైజ్‌కి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ నెల 23న సినిమా వైభవంగా మొదలవుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఈవెంట్‌కు అతిరథమహారథులు వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం తామెంతగా ఎదురుచూస్తున్నారో చెప్పేలా అమెరికాలోని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. సినిమా కోసం ఎదరుచూస్తున్నాం అని తెలుపుతూ ఒక బ్యానర్‌ను విమానం సహాయంతో ఆకాశంలో ప్రదర్శించారు.

‘‘థ్యాంక్యూ తారక్‌. నీ 30వ సినిమా కోసం వేచి చూస్తున్నాం’’ అని ఆ బ్యానర్‌పై రాశారు. ఈ సర్‌ప్రైజ్‌ విషెష్‌కి సంబంధించిన వీడియోను ‘ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ యూఎస్‌ఏ’ పోస్ట్‌ చేయగా.. ఫ్యాన్స్‌ తెగ వైరల్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను మిక్కిలినేని సుధాకర్‌, కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు.


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus