ప్రముఖ బిజినెస్మెన్, వ్యాపారవేత్త అయినటువంటి గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా డెబ్యూ ఇస్తూ ‘జూనియర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వారాహి చలన చిత్రం’ బ్యానర్‌పై రజని కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా కూడా ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనుంది.
కన్నడ, తమిళ సినీ పరిశ్రమకు చెందిన స్టార్లు అంతా ఈ సినిమాలో నటించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ‘వైరల్ వయ్యారి’ అనే పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందులో కిరీటీ రెడ్డి స్టెప్స్ అదిరిపోయాయి అనే చెప్పాలి. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
2 గంటల 16 నిమిషాల నిడివి కలిగిన ఈ ట్రైలర్.. ఎమోషనల్ గా మొదలైంది. లేటు వయసులో హీరో తల్లి గర్భం దాల్చడం.. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నవాళ్లు.. హీరో తల్లిదండ్రులను సూటి పోటి మాటలతో ఇబ్బంది పెట్టడాన్ని చూపించారు. అటు తర్వాత హీరో కిరీటి రెడ్డి ఆకతాయి కుర్రాడిగా ఎంట్రీ ఇచ్చాడు.
అతని కాలేజ్ లైఫ్, ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే కామెడీ, హీరోయిన్ తో లవ్ ట్రాక్ వంటివి చూపించారు. ఆ తర్వాత జెనీలియా ఎంట్రీ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అలాగే యాక్షన్స్ సీక్వెన్స్.. వంటివి కూడా హైలెట్ అయ్యాయి. దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :