Kabzaa First Review: కబ్జా మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్న ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన కబ్జా మూవీ పాన్ ఇండియా మూవీగా రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ నెల 17వ తేదీన రిలీజ్ అవుతోంది. ఈ వారం విడుదలవుతున్న సినిమాలలో ఈ సినిమాపైనే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. 136 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ సినిమా కోసం యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఏడు భారతీయ భాషల్లో ఈ సినిమా రిలీజవుతుండగా ప్రముఖ క్రిటిక్స్ లో ఒకరైన ఉమైర్ సంధు ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు. ఉమైర్ సంధు ఈ సినిమా గురించి పాజిటివ్ గా రియాక్ట్ కావడం గమనార్హం. శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో ఈ మూవీ మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కన్నడ ఇండస్ట్రీ దశను ఈ సినిమా మార్చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ అద్భుతంగా నటించారని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలుస్తుందని చెబుతూ 3.5 రేటింగ్ ఇచ్చారు. కిచ్చా సుదీప్ పవర్ పాక్డ్ పర్ఫామెన్స్ ఇచ్చారని కబ్జా సినిమాకు ఆయన పాత్ర ఆత్మ అని ఉమైర్ సంధు పేర్కొన్నారు. ఉమైర్ సంధు రివ్యూ పాజిటివ్ గా ఉండటంతో ఈ సినిమా అభిమానులు సంతోషిస్తున్నారు.

శ్రీ సిద్దేశ్వర ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌ పై ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఆర్ చంద్రు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం. పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు రవి బస్రూర్ సౌండ్ ట్రాక్ లు సమకూర్చారు. శ్రియ, కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus