చిన్న సమాచారం కావాలన్నా, పెద్ద విషయం కావాలన్నా గూగుల్‌ని ఆశ్రయించేస్తుంటాం. అంతలా గూగుల్ మనకు కంటెంట్ ఇస్తోంది. అందులోనూ సెలబ్రిటీలకు సంబంధించిన సమాచారం అయితే ఇంకా ఎక్కువ అందులో దొరుకుతుంది. ఈ క్రమంలో గూగుల్ తరచుగా తమ సెర్చ్ ఇంజిన్ ఎవరి గురించి ఎక్కువగా వెతికారు అనే విషయాన్ని వెల్లడిస్తూ ఉంటుంది. అలా ఈ ఏడాదికి సంబంధించి సగం సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో ఆసియా ఖండంలో అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల జాబితాను గూగుల్ ప్రకటించిందంటూ ఓ ఇమేజ్ సర్క్యులేట్ అవుతోంది.
ఆ జాబితా ప్రకారం చూస్తే.. వి తొలి స్థానంలో నిలవగా, ఆఖరి స్థానంలో నానా కొమత్సు ఉన్నారు. ఇది ఆసియా మొత్తంలో చూస్తే. అదే మన దేశం సంగతి చూస్తే.. తొలి స్థానంలో గాయకుడు, నాయకుడు దివంగత సిద్ధు మూసేవాలా (3) ఉన్నాడు. ఆఖరి స్థానంలో అనన్య పాండే (98) ఉంది. ఇక మరీ డీప్‌గా వెళ్లి సౌత్ సెలబ్రిటీల లెక్క చూస్తే 15వ స్థానంలో కాజల్ అగర్వాల్ ఉంది. అలా ఆఖరి ప్లేస్‌లో అంటే 91వ స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ నిలిచింది.
ఈ జాబితాలో నిలిచిన మిగిలిన సౌత్ సెలబ్రిటీల సంగతి చూస్తే… సమంత (18), అల్లు అర్జున్ (19), రష్మిక మందన (20), విజయ్ (22), నయనతార (33), తమన్నా (37), యశ్ (40), పూజా హెగ్డే (44), మహేష్ బాబు (47), రామ్‌చరణ్ (53), అనుష్క శెట్టి (56), ఎన్టీఆర్ (58), ధనుష్ (61), కీర్తి సురేశ్ (62), సూర్య (63), ప్రభాస్ (68), శ్రీదేవి (75), రజనీకాంత్ (77) ఉన్నారు. ఏడాది పూర్తయ్యేసరికి ఈ జాబితాలో మార్పులు ఉండొచ్చు.
ఇప్పటివరకు అయితే వీళ్లే మోస్ట్ సెర్చ్‌డ్ టాప్ 100 ఆసియన్స్ అని చెప్పొచ్చు. బాలీవుడ్ సెలబ్రిటీల్లో చూస్తే తొలి స్థానంలో లతా మంగేష్కర్ (5) ఉన్నారు. ఆమె కాకుండా టాప్ 10లో కత్రినా కైఫ్ (7), ఆలియా భట్ (8), ప్రియాంకా చోప్రా (9), విరాట్ కోహ్లీ (10) ఉన్నారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!