వాళ్లతో బేరాలు ఆడకండి : కాజల్

కాజల్ తెలుగు.. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చినా.. కాజల్ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. స్టార్ హీరోలు ఇప్పటికీ కాజల్ తో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ కాజల్ మాత్రం ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటుంది. త్వరలో ఈమె కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా కాజల్ కు మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది కూడా..! అయితే తాజాగా ఓ క్యాబ్ డ్రైవర్ తనతో కన్నీళ్లు పెట్టించాడు అనే ట్వీట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది కాజల్.

కాజల్ మాట్లాడుతూ.. “ఓ క్యాబ్ డ్రైవర్ నా ముందు ఏడుస్తూ కనిపించడంతో.. ‘ఏమైంది అని’ అతనిని అడిగాను. దానికి అతను.. గడిచిన 48గంటలలో మీరే నా మొదటి కస్టమర్ మేడం.. అని చెప్పాడు. ఓ 70కిలోమీటర్ల ప్రయాణం తర్వాత అతను నన్ను దింపి వెళ్ళిపోయాడు. దయచేసి క్యాబ్ డ్రైవర్లతో బిల్ తగ్గించమని భేరాలు ఆడకండి. వాళ్ళు రోజూవారి కూలి పని పై ఆధారపడి బతికేవాళ్లు. కుదిరితే కాస్త డబ్బులు ఎక్కువగా ఇవ్వండి. ఆ క్యాబ్ డ్రైవర్ పరిస్థితి విన్నాక నా గుండె తరుక్కుపోయింది. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో.. ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో.. ఆలోచిస్తేనే కళ్ళలో నీళ్లు తిరుతున్నాయి” అంటూ పేర్కొంది. కరోనా వైరస్ భయంతో చాలా మంది ఉద్యోగులకి హాలిడేస్ లేదా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సదుపాయాలు ఇచ్చేసారు. కాబట్టి ఇలాంటి క్యాబ్ డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతున్న సంగతి నిజమే. అలా అని కాజల్ లా అందరి నెటిజన్లు డబ్బులు ఉన్నవాళ్ళు కాదు కదా అని ప్రశించే వాళ్ళు కూడా లేకపోలేదు.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus