Kajal Aggarwal: కాజల్ ని గౌరవించిన యుఏఈ ప్రభుత్వం!

స్టార్ హీరోయిన్ కాజల్ కి అరుదైన వీసా లభించింది. యుఏఈకి చెందిన గోల్డెన్ వీసాను పొందారు కాజల్. ఈ విషయాన్ని కాజల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. యూఏఈ బేస్డ్ జుమా అల్మ్ హిరీ బిజినెస్‌ కన్సల్టేషన్‌ సంస్థ ద్వారా ఈ గోల్డెన్‌ వీసాని పొందింది కాజల్‌. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధి మహమద్‌ షానిద్‌ అసిఫలి చేతుల మీదుగా కాజల్‌ ఈవీసాని అందుకుంది.

తమవంటి కళాకారులకు యూఏఈ మొదటి నుంచి ఎనలేని ప్రోత్సాహం అందిస్తోందని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చింది కాజల్. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, భవిష్యత్తులో యూఏఈలో చేపట్టబోయే కార్యకలాపాల పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కాజల్ తెలిపింది. ఈ సందర్భంగా మహ్మద్ షానిద్, సురేశ్ పున్నస్సెరిల్, నరేశ్ కృష్ణలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించింది.

యూఏఈ అందించే ఈ గోల్డెన్ వీసాతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. విదేశీయులు ఎలాంటి స్పాన్సర్ షిప్ అవసరం లేకుండా యూఏఈలో ఉద్యోగాలు చేసుకోవడానికి, నివసించడానికి ఈ వీసా పనికొస్తుంది. అంతేకాదు.. గోల్డెన్ వీసా ఉన్నవారిని యూఏఈ పౌరులుగా గుర్తిస్తారు. వారు యూఏఈలో సొంతంగా వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. ఈ వీసా ఆటోమేటిగ్గా రెన్యువల్ అవుతుంటుంది. ఇటీవల మెగా కోడలు ఉపాసన కూడా ఈ గోల్డెన్ వీసా అందుకుంది.

ఇక కాజల్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె గర్భవతి కావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇటీవల ఆమె బేబీ బంప్ ఫొటోలు బయటకొచ్చాయి. మరోపక్క ఆమె నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే తమిళంలో ‘హే సినామికా’ అనే సినిమా చేసింది. హిందీలో ‘ఉమా’ అనే సినిమాలో నటించింది. ఇవన్నీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus