కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు తగ్గిన తరువాత హీరోయిన్లు ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. రిస్క్ లేదని తెలిసినప్పుడు ఆ దిశగా అడుగులేస్తారు. ఇప్పుడు కాజల్ కూడా అదే చేస్తోంది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్ల జోరు తగ్గుతుంటుంది. కానీ కాజల్ మాత్రం స్పీడ్ పెంచింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీర్ లలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది.
అలానే బాలీవుడ్ లో ‘ఉమ’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కనిపించనుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రవీణ్ సత్తారు సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఇందులో నాగార్జున ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కాజల్ రోల్ డిఫరెంట్ గా ఉంటుందట. కమర్షియల్ హీరోయిన్ మాదిరి కేవలం పాటలు, రొమాన్స్ అని కాకుండా చాలెంజింగ్ రోల్ లో కనిపించబోతుంది. కథ ప్రకారం కాజల్.. రా ఏజెంట్ గా నటిస్తోంది. అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా,
ఉగ్రవాదులతో సన్నిహితంగా మెలుగుతూ, వాళ్ల సమాచారాన్ని ఇండియన్ ఆర్మీకి అప్పగించే పాత్రలో కాజల్ కనిపిస్తుందట. సినిమా మొత్తం ఆమె రోల్ సీరియస్ ఎమోషన్ తో సాగుతుందట. మరి కాజల్ ఇలాంటి రోల్ లో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి!
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!