నాని అడిగితే కాజల్ కాదంటుందా ?
- August 31, 2017 / 06:33 AM ISTByFilmy Focus
నాని నిర్మాతగా మారబోతున్నాడోచ్ అనే వార్త మీరు “ఫిల్మీఫోకస్”లో చదివే ఉంటారు. అయితే.. తాను పూర్తి స్థాయి నిర్మాతగా మారుతూ రూపొందించబోయే సినిమా కోసం నానీ మామూలు ప్లానింగ్ చేయట్లేదండోయ్. భారీ స్థాయి సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా స్టార్ క్యాస్టింగ్ ను సెట్ చేసుకొంటున్నాడు. ప్రశాంత్ అనే షార్ట్ ఫిలిమ్ మేకర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని నిర్మిస్తున్న చిత్రంలో క్రేజీ కథానాయకి కాజల్ ఓ కీలకపాత్ర పోషించనున్నదని సమాచారం. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాని ఆల్రెడీ కాజల్ ను కలిసి స్టోరీ లైన్ చెప్పడం జరిగిందని, నాని మీద మంచి అభిప్రాయమున్న కాజల్ అగర్వాల్ కథ కూడా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేసిందని తెలుస్తోంది.
ఇంకో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో కాజల్ తోపాటు నాని చిరకాల మిత్రురాలు నిత్యామీనన్ మరియు నాని లేటెస్ట్ జోడీ నివేదా థామస్ కూడా నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సో, నానీబాబు నిర్మాతగా కూడా హిట్ కొట్టేందుకు సర్వసన్నాహాలు చేసుకొని సన్నద్ధమవుతున్నాడన్నమాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














