Kajal: మానస్ ఇంకా సన్నీ ఇద్దరినీ ఏడిపిస్తూ వెళ్లిన కాజల్ ఏం చెప్పిందో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో కాజల్ జెర్నీ ఎట్టకేలకి ముగిసింది. హౌస్ మేట్స్ లో తన ఫ్రెండ్ అయిన మానస్ తో పాటుగా ఎలిమినేషన్ లో ఉన్నప్పుడే కాజల్ కి తను ఎలిమినేట్ అవ్వబోతున్నాను అనేది అర్ధం అయ్యింది. నిజానికి సిరిని ఫైనలిస్ట్ గా ఎప్పుడైతే సన్నీ చూపించాడో అప్పుడే షణ్ముక్ అండ్ శ్రీరామ్ ఇద్దరికీ కాజల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అర్ధం అయ్యింది. ఇక లాస్ట్ లో మానస్ ఇంకా కాజల్ ఉన్నప్పుడు మానస్ ని ఫైనలిస్ట్ గా ఎనౌన్స్ చేసిన కింగ్ నాగార్జున కాజల్ ని ఎలిమినేట్ చేశాడు.

కాజల్ ఎలిమినేట్ అవ్వగానే సన్నీ ఇంకా మానస్ ఇద్దరూ కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ హౌస్ నుంచీ కన్నీటీ వీడ్కోలు పలికారు. మానస్ అయితే కాజల్ ని పట్టుకుని బాధపడ్డాడు. సన్నీ ఏడుస్తూ మాట్లాడటానికి కూడా తడబడ్డాడు. ముగ్గురూ చాలాసేపు ఎమోషనల్ అయ్యారు.గత కొన్నివారాలుగా మానస్, సన్నీ, కాజల్ ముగ్గురూ ఫ్రెండ్స్ గా చక్కటి ప్రదర్శనని కనబరిచారు. అంతేకాదు, ఒకరికోసం ఒకరు గేమ్ లో కలిసిమెలిసి ఉన్నారు. బిగ్ బాస్ వ్యూవర్స్ కూడా వీరికి SMK గా పేరు పెట్టారు. ఈ బాండింగ్ ఆఖరి వారం వరకూ కూడా కొనసాగింది.

ఇక టాప్ 6 కంటెస్టెంట్ గా కాజల్ బయటకి వచ్చింది. స్టేజ్ పైన నాగార్జునని పలకరిస్తూ తన జెర్నీ హౌస్ లో ఎలా సాగిందో చూసుకుంది. జెర్నీ చూస్తున్నంత సేపు చాలా ఎమోషనల్ అయిపోయింది కాజల్. ఆ తర్వాత కాజల్ హౌస్ లో ఉన్న టాప్ 5 గురించి మాట్లాడింది. ఒక టాస్క్ ఆడుతూ 5 మచ్ ఎంటర్ టైనర్ అంటే సన్నీ అని సన్నీకి ఈ ట్యాగ్ ఇచ్చింది. 5మచ్ ఫ్రెండ్షిప్ మానస్ అని మానస్ తో తనకున్న స్నేహం గురించి చెప్పింది. 5మచ్ ఎమోషన్ సిరి అని, సిరి ఏది కూడా మనసులో దాచుకోలేదని, బయటకి చెప్పేస్తుందని, ఎమోషన్ చూపించేస్తుందని చెప్పింది.

ఇక్కడే నాగార్జున కాజల్ కి హగ్ ఇస్తూ సిరికి కౌంటర్ కూడా వేశారు. ఇక 5మచ్ యాక్షన్ శ్రీరామ్ అని, టాస్క్ వచ్చిందంటే చాలు ఎలా ఆడాలో బాగా ప్రిపేర్ అయిపోతాడని, ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా రెడీ అవుతాడని యాక్షన్ హీరో అంటూ చెప్పింది. ఇక 5మచ్ డ్రామా షణ్ముక్ లో ఉందని సిరిని కంట్రోల్ చేస్తుంటాడని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ అనేది తన కల అని, ఇన్నిరోజులు ఇక్కడ ఉండటం నాకు నిజంగా దక్కిన అదృష్టం అంటూ చెప్తూ ఎమోషనల్ అయ్యింది కాజల్. అదీ మేటర్.

[yop_poll id=”7″]

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus