తేజ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది కాజల్. ఆ తర్వాత వచ్చిన ‘చందమామ’ ‘మగధీర’ చిత్రాలు ఈమెను స్టార్ హీరోయిన్ ను చేశాయి. ఆ తర్వాత చాలా హిట్ సినిమాల్లో నటించి తన మార్కెట్ ను ఇంకా పెంచుకుంది కాజల్. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కాజల్. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా 2020 లో పెళ్లి చేసుకుంది కాజల్.
అదే కారణమో.. ఏమో కానీ, ఆమె పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గాయి. పారితోషికం కూడా తగ్గింది అని చెప్పాలి. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే కాజల్ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రంలో కాత్యాయనీ అనే మిడిల్ ఏజ్డ్ రోల్ ప్లే చేసింది. అక్టోబర్ 19 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కాజల్ వయసు పై కూడా సెటైర్లు వేస్తూ జోకులు ఉంటాయట.
ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇదే చిత్రంలో శ్రీలీల కూడా నటించింది. ఆమె కూడా స్టార్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.అయితే కాజల్ రేంజ్ సక్సెస్ లు ఆమె చూసింది లేదు. అయినప్పటికీ ‘భగవంత్ కేసరి’ సినిమాకి గాను కాజల్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకుందట శ్రీలీల. అందుతున్న సమాచారం ప్రకారం..
‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రానికి కాజల్ రూ.1.05 కోట్లు పారితోషికం తీసుకుంటే.. శ్రీలీల మాత్రం ఏకంగా రూ.1.8 కోట్లు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది. ‘భగవంత్ కేసరి’ స్క్రిప్ట్ ‘ధమాకా’ టైంలో ఒకే చేసింది కాబట్టి.. ఇప్పుడున్న డిమాండ్ కి ఇంకా తక్కువగానే శ్రీలీల పారితోషికం అందుకున్నట్టు స్పష్టమవుతుంది.