Kalki 2: ‘కల్కి 2’కి ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చేశాడా? ‘స్పిరిట్‌’కి బ్రేకులేస్తారా?

ప్రభాస్‌లా వరుస సినిమాలు చేస్తున్న హీరో, వరుస సినిమాలు ఒప్పుకున్న స్టార్‌ హీరో ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లో కూడా ఎవరూ లేరేమో అనిపిస్తోంది అతని లైనప్‌ చూస్తుంటే. ఒక సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంటే.. సెట్స్‌ మీద రెండు సినిమాలు ఉండగా.. మరో రెండు సినిమాలు సెట్స్‌ మీదకు రావడానికి ప్లాన్స్‌ జరుగుతున్నాయి. ఇంకోవైపు ఇంకో రెండు సినిమాల చర్చలు తుది దశలో ఉన్నాయి. అలా మొత్తంగా ఏడు సినిమాలతో బిజీగా ఉన్నాడు డార్లింగ్‌.

Kalki 2

అయితే రీసెంట్‌గా సెట్స్‌ మీదకు వచ్చిన ఓ సినిమాను త్వరలో సెట్స్‌ మీదకు రానున్న సినిమా డిస్ట్రబ్‌ చేస్తుందా? ఏమో టాలీవుడ్‌లో జరుగుతున్న చర్చలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఎందుకంటే ప్రభాస్ కెరీర్‌లో రూ.వెయ్యి కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు సీక్వెల్ త్వరలోనే సెట్స్‌పైకి తీసుకొచ్చే ప్లాన్స్‌ జరుగుతున్నాయని టాక్‌. అంతేకాదు ఆ సినిమా కోసం డేట్స్‌ కూడా ఇచ్చేశాడట డార్లింగ్. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఫస్టాఫ్‌లోనే ‘కల్కి 2’ సెట్స్ పైకి వస్తుందట.

రీసెంట్‌గా ప్రభాస్‌కి ఓ అలవాటు వచ్చింది. ఇతర అగ్ర హీరోలకు లేని అవాటు అది. అదే ఒకేసారి రెండు సినిమాలను సెట్స్‌పై పెట్టడం. మొన్నటివరకు ‘ది రాజా సాబ్‌’, ‘ఫౌజీ’ సినిమాలను అలానే నడిపించాడు. ఆ తర్వాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకొని విదేశాలకు వెళ్లి తిరిగొచ్చి ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ సినిమాలు ప్రారంభించాడు. ఆ లెక్కన ‘స్పిరిట్‌’, ‘కల్కి 2’ ఒకేసారి షూటింగ్లో ఉండొచ్చు.

అయితే రెండు పాత్రలు ఏ మాత్రమూ దగ్గర దగ్గర ఉండవు. కాబట్టి డబుల్‌ మూవీస్‌ కష్టమే. ఇలా అయితే ‘స్పిరిట్‌’కి బ్రేకులేసి ‘కల్కి 2’ సినిమా స్టార్ట్‌ చేయాలి. లేదంటే ‘స్పిరిట్‌’ సినిమాను పూర్తి చేసి ఇటువైపు రావాలి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు.

రోషన్‌ మీద అంత బడ్జెట్‌ పెడుతున్నారా? రిస్కే కానీ నమ్మకం ఉందంట!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus