‘ఓం కమ్ టు మై రూమ్’… ప్రభాస్ చెప్పిన ఈ వైరల్ డైలాగ్ గుర్తుందా? ఒకవేళ గుర్తుంటే ఇప్పుడు మేం చెప్పబోయేది ‘ఆదిపురుష్’ గురించే అని ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు. ‘ఆదిపురుష్’ ట్రైలర్ రిలీజ్ తర్వాత బీటీఎస్ వీడియోలో ప్రభాస్ ఈ మాట అన్నాడు. అయితే ఎందుకు అన్నాడో తెలియదు కానీ… సినిమా నాణ్యత బాగాలేదు అనే విమర్శల విషయంలో మాట్లాడటానికే అలా అన్నాడు అంటూ లెక్కలేసి తేల్చేశారు నెటిజన్లు.
ఆ సినిమాలో కథ, కథనం, వీఎఫ్‌ఎక్స్, కాస్టింగ్… ఇలా చాలా విషయాల్లో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఏవో రిపేర్లు చేశాం అంటూ లేటు చేసి సినిమా రిలీజ్ చేసినా పెద్ద ఉపయోగం ఏమీ లేదు. దీంతో ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. మొన్నీమధ్య ఓటీటీలో వచ్చినా ఇలానే మాటలు పడ్డారు. అయితే ఇన్నాళ్లూ ఈ మాటలు అన్నది బయటి జనాలు. కానీ ఇప్పుడు ప్రభాస్ సినిమాకే పని చేస్తున్న మరో టెక్నీషియన్ ఈ మాటలు అన్నారు. దీంతో ఇప్పుడు ‘బయటివాళ్లు అంటే అన్నారు… సినిమా జనాలే అంటే ఎలా?’ అనే ప్రశ్న వస్తోంది.
‘కల్కి 2898 AD’ సినిమా ఎడిటర్ విశాల్ కుమార్ ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్‌లో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ‘ఆదిపురుష్’ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కల్కి’లో విజువల్ ఎఫెక్ట్స్ ఓ అభిమాని ఏదో ప్రశ్న వేస్తే… గత 10 ఏళ్లుగా విజువల్ ఎఫెక్ట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాం. ‘అవతార్’, ‘అవెంజర్స్’ లాంటి సినిమాల వీఎఫ్‌ఎక్స్‌ను కూడా పరిశీలించాం.
మా ఇన్నాళ్ల కష్టం ఫలితాన్ని (Kalki) ‘కల్కి’ సినిమాలో చూస్తారు అని చెప్పిన విశాల్ కుమార్ అక్కడితో ఆగకుండా ‘అయినా ఇది మీ ‘ఆదిపురుష్’ కాదు’ అని కామెంట్ చేశారు. దీంతో తమ సినిమా గురించి గొప్పగా చెప్పుకోవాలి కానీ.. అదే హీరో చేసిన వేరే సినిమాతో కంపేర్ చేసుకోవడం సరికాదు అని కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!