Kalki: ‘కల్కి’ రిలీజ్‌ డేట్‌ అదేనా? త్వరలోనే చెప్పేస్తారా?

‘కల్కి’ సినిమా టీమ్‌ ఓ వెబ్‌ సైట్‌ను లాంచ్‌ చేసింది చూశారా? అందులో నెంబర్లు అటు ఇటు మారుతూ ఉన్నాయి. పేజీ రిఫ్రెష్‌ చేస్తే మళ్లీ మొదటి నుండి నెంబర్లు వస్తున్నాయి. ఎందుకు ఆ వెబ్‌ సైట్‌ పెట్టారు, దాని ద్వారా ఏం చెప్పాలని అనుకున్నారు లాంటి చర్చలు ‘కల్కి 2898 ఏడీ’ ట్విటర్‌ పేజీలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే టీమ్‌ నుండి ఎలాంటి సమాచారం లేదు. అయితే దానికి కారణం సినిమా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ అనేది లేటెస్ట్‌ టాక్‌.

‘కల్కి’ సినిమా రిలీజ్‌ డేట్‌ త్వరలో చెప్పేస్తారు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. మొన్నామధ్య దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ యూనివర్శిటీకి వెళ్లి సినిమా గురించి గొప్పగా చెప్పుకొని వచ్చారు. సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారు అనే విషయాన్ని క్లియర్‌గా వివరించి మరీ చెప్పారు. అయితే సినిమా రిలీజ్‌ గురించి మాత్రం చెప్పలేదు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా సినిమా విడుదల తేదీని ఇప్పుడు చెబుతారు అని అంటున్నారు. దాని కోసమే ఆ వెబ్‌సైట్‌ అట.

సినిమాకు ఉన్న బజ్‌, క్రేజ్‌ దృష్టిలో పెట్టుకుని, అలా సినిమా కథ నేపథ్యాన్ని తెలిపేలా టైమ్‌ ట్రావెల్‌ అనే కాన్సెప్ట్‌లో వెబ్‌సైట్‌ను డిజైన్‌ చేశారట. ఏం జరుగుతోంది, ఆ టైమ్‌ ఏంటి, ఆ డేట్స్‌ ఏంటి అనే వివరాలు చర్చకు వచ్చేలా ఆసక్తికరంగా ఆ వెబ్‌సైట్‌ రూపొందించారని టాక్‌. ఇక ఈ సినిమాను వైజయంతి మూవీస్‌కు చాలా ఇష్టమైన, లక్కీ డేట్‌నే సినిమా రిలీజ్‌కు అనుకుంటున్నారట. అన్నీ అనుకుంటున్నట్లుగా జరిగితే మే 9న సినిమాను రిలీజ్‌ చేస్తారట.

వైజయంతి మూవీస్‌కు మే 9 ఎందుకు స్పెషల్‌ అనేది మీకు తెలిసే ఉంటుంది. చిరంజీవి – శ్రీదేవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఆ తేదీనే వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ తర్వాత ‘మహా నటి’ కూడా ఆ రోజునే వచ్చింది. ఆ సినిమా ఆ నిర్మాణ సంస్థకు కలికితురాయిగా నిలిచింది. అందుకే ఇప్పుడు (Kalki) ‘కల్కి 2898 ఏడీ’ని కూడా అప్పుడే తీసుకొస్తారట. ఆ విషయం ఈ నెల 12న చెబుతారట.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus