తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అటు అబ్బాయిలతో కానీ , ఇటు అమ్మాయిలలో కానీ కమెడియన్స్ విషయం లో కొదవే లేదు. ఇండియాలోనే అత్యధిక కమెడియన్స్ ఉన్న ఏకైక ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ. అయితే ఇంతమందిలో కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే కమెడియన్స్ గా మిగిలిపోవాలంటే ఎంతో టాలెంట్ ఉండాలి. అలాంటి అరుదైన టాలెంట్ ఉన్న ఆర్టిసులలో ఒకరు కల్పనా రాయ్. ఈమె ఏ సినిమాలో కూడా పూర్తి స్థాయి రోల్ చెయ్యలేదు, కేవలం చిన్న చిన్న పాత్రలు మాత్రమే పోషిస్తూ ఇండస్ట్రీ లో నెట్టుకొచ్చింది.
అలా చిన్న చిన్న పాత్రలతోనే ఈమె దాదాపుగా 450 కి పైగా సినిమాల్లో నటించింది. ఈమె నటించిన ప్రతీ సినిమా కూడా , మంచి గుర్తింపుని తెచ్చిపెట్టినవే. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో, డిఫ్ఫెరెంట్ కామెడీ టైమింగ్ మరియు మ్యానరిజమ్స్ తో నవ్వు రప్పించడం కల్పనా రాయ్ కి వెన్నతో పెట్టిన విద్య. ఓ సీత కథ’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా కల్పనా రాయ్, ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘జాంబ లకడి పంబ’ అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపుని దక్కించుకుంది.
ఇందులో ఆమె (Kalpana Rai) చేసింది చిన్న పాత్రే అయ్యినప్పటికీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా కడుపుబ్బా నవ్వించింది. అలాంటి లెజెండరీ ఆర్టిస్ట్ 2008 వ సంవత్సరం లో హైదరాబాద్ లోని ఇందిరా నగర్ లో మృతి చెందింది. ఈమెకంటూ ఒక సొంత కుటుంబం లేదు. అందుకే తానూ సంపాదించింది అతి తక్కువే అయినా, తనకి ఉన్నంత లో నలుగురికి సహాయం చేస్తూ బ్రతికిన మనిషి ఆమె. అయితే ఆమె చివరి రోజుల్లో మాత్రం ఆమెకి డబ్బులు అవసరమైనప్పుడు ఎవ్వరూ సహాయం చెయ్యలేదు.
అనారోగ్యం తో బాదపడుతున్న సమయం లో చికిత్స కి డబ్బులు లేక అలాగే మరణించింది. చివరికి ఆమె అంత్యక్రియలకు కూడా డబ్బులు లేవు, అంత దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితిలో ‘మూవీ ఆర్టిస్ట్స్ అస్సోసియేషన్’ ముందుకొచ్చి 10 వేళా రూపాయిలు అంత్యక్రియల కోసం ఇచ్చారు. నలుగురికి సహాయం చేస్తూ బ్రతికిన ఒక మహిళకి ఆ దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేసాడు అని ఈమెని అభిమానించే వాళ్ళు బాధపడుతూ ఉంటారు.
జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!