మా సినిమా బుధవారంతో బ్రేక్ ఈవెన్… మా సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది!

ఈ వారం ‘ఓదెల 2’ (Odela 2) ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘ఓదెల’ కి తమన్నా (Tamannaah Bhatia) , సంపత్ నంది (Sampath Nandi) పెద్ద దిక్కు. ఇది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram)  ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ కి విజయశాంతి (Vijaya Shanthi) , ఎన్టీఆర్ (Jr NTR)  వంటి స్టార్స్ పెద్ద దిక్కుగా నిలిచారు. ‘ఓదెల 2’ కి ఎలా ఉన్నా… ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చూపలేకపోతున్నాయి. ఇలాంటి టైంలో మేకర్స్ తమ సినిమాలు బ్రేక్ ఈవెన్ అయిపోయాయి అంటూ డబ్బా కొట్టుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసే అంశం.

Kalyan Ram, Sampath Nandi

మొన్నటికి మొన్న ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా సక్సెస్ మీట్లో హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ” డిస్ట్రిబ్యూటర్లు నాతో ఫోన్లో మాట్లాడారు. మంగళవారం లేదా బుధవారం నాటికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది” అని చెప్పారు. నేను రేపే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అని చెప్పవచ్చు. కానీ వాళ్ళు చెప్పిందే నేను చెబుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. కానీ వాస్తవానికి ఈ సినిమా 2 రోజుల్లో కనీ కష్టంగా 20 శాతం రికవరీ సాధించింది.

వీకెండ్ టైంలోనే ఇలాంటి కలెక్షన్లు వస్తే… సోమ, మంగళ, బుధవారానికి మిగిలిన 80 శాతం ఎలా రికవరీ అయిపోతుంది. కళ్యాణ్ రామ్ (Kalyan Ram) వంటి హీరో కూడా కలెక్షన్స్ గురించి ఇలా మాట్లాడాలా? ఇక మరోపక్క సంపత్ నంది. ఈరోజు ‘ఓదెల 2’ సక్సెస్ మీట్లో అతను మాట్లాడుతూ.. ” మా సినిమా బ్రేక్ ఈవెన్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ వాస్తవానికి ‘ఓదెల 2’ రిలీజ్ కి ముందే బ్రేక్ ఈవెన్ అయిపోయింది.

సినిమా మేము అనుకున్న బడ్జెట్లో తీశాం. గ్రాఫిక్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి అని చాలామంది చెప్పారు. సినిమాలో సమాధి శిక్ష, పంచాక్షరీ మంత్రం, కపాల మోక్షం వంటి మంచి అంశాల గురించి జనాలకి చెప్పండి. బ్రేక్ ఈవెన్ గురించి మీరు బాధపడాల్సిన పని లేదు” అన్నట్టు చెప్పుకొచ్చాడు. సంపత్ చెప్పింది నిజమే అనుకుందాం. బ్రేక్ ఈవెన్ అయిపోయినప్పుడు.. సక్సెస్ మీట్ పెట్టి, రివ్యూల గురించి చెప్పి బాధపడాల్సిన అవసరం ఏముంది?

‘ఓదెల 3’ ట్విస్ట్ బయట పెట్టి.. కాంట్రోవర్సీకి చెక్ పెట్టిన సంపత్ నంది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus