Kalyan Ram: కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకి మార్పులు!

అప్పటివరకు వరుస ప్లాప్స్ తో డీలా పడ్డ కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ను నిలబెట్టుకునే పనిలో పడ్డారు ఈ నందమూరి హీరో. నిజానికి ‘బింబిసార’తో పాటు సైలెంట్ గా మరో సినిమా కూడా రెడీ చేశారు కళ్యాణ్. రాజేంద్ర అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ముందుగా దసరా సీజన్ లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు.

కానీ ఇప్పుడు రిలీజ్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ‘బింబిసార’ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో తన కొత్త సినిమాకి మరిన్ని మార్పులు చేసి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. దీనికోసం దర్శకనిర్మాతలకు మరింత సమయం కావాలి. కాబట్టి డిసెంబర్ కి సినిమాను వాయిదా వేశారు. ‘బింబిసార’ సినిమా తరువాత హీరో కళ్యాణ్ రామ్, మైత్రి మూవీ నిర్మాతలు కలిసి ఈ కొత్త దర్శకుడి సినిమాకి మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

దానికి తగ్గట్లుగా చర్చలు సాగిస్తున్నారు. అవన్నీ ఓ కొలిక్కి వచ్చిన తరువాత షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాతో పాటు దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేయబోతున్నారు కళ్యాణ్ రామ్. అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే క్లారిటీ లేదు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తయిన తరువాతే ‘బింబిసార 2’ సినిమా పట్టాలెక్కుతుందట. అప్పటివరకు ‘బింబిసార 2’ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. మధ్యలో కళ్యాణ్ రామ్ నటించిన ‘డెవిల్’ సినిమా రిలీజ్ కూడా ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus