Kalyan Ram: ఆ నాటి గుర్తులు అందుకే కనిపిస్తాయి: కల్యాణ్‌రామ్‌

అతను పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకడం లేదు.. చాలా ఏళ్లుగా కల్యాణ్‌రామ్‌ను చూసి సినీ గోయర్స్‌ ఈ మాట అంటూనే ఉంటారు. టాలీవుడ్‌లో రిస్క్‌ చేసే హీరోలు చాలా తక్కువమంది ఉండగా, అందులో కల్యాణ్‌రామ్‌ ఒకరు. కథల విషయంలో, నిర్మాణం విషయంలో కల్యాణ్‌రామ్‌ చాలా ప్రయోగాలే చేశారు. ఇప్పుడు ఆయన చేసిన మరో ప్రతిష్ఠాత్మక, విభిన్న చిత్రం ‘బింబిసార’. టైమ్‌ ట్రావెల్‌ కథతో రూపొందిన ఈ సినిమా రేపే విడుదలవుతోంది.

ఈ క్రమంలో చిత్రబృందం ప్రచారం జోరు పెంచింది. ఈ క్రమంలో కల్యాణ్‌ రామ్‌ అన్న మాటలు వైరల్‌గా మారాయి. నందమూరి తారక రామారావు ‘పాతాళభైరవి’ని గుర్తుకు తెచ్చేలా ‘భైరవద్వీపం’ సినిమా చేసి బాబాయ్‌ బాలకృష్ణ మంచి విజయం సాధించారు. ఇప్పుడు నా ‘బింబిసార’ కూడా అలాంటి విజయాన్నే సాధిస్తుంది అని కల్యాణ్‌రామ్‌ కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఆ రోజుల నాటి ఫాంటసీ సీన్లను ఈ సినిమాలో మీరు విట్‌నెస్‌ చేయొచ్చు అని చెప్పాడు కల్యాణ్‌రామ్‌.

అంత పెద్ద సినిమాలతో ఈ సినిమాను పోల్చడంతో.. అంచనాలు అయితే పెరిగాయి. మరి అందుకుంటారా అనేది చూఆలి. మీ తాతగారు, బాబాయి జానపద చిత్రాల ఫ్లేవర్‌, రిఫరెన్స్‌లు ఈ సినిమాలు ఉన్నాయి అనే మాట వినిపిస్తోంది.. దీనికి మీరేమంటారు అని కల్యాణ్‌రామ్‌ను అడిగితే.. మా సినిమా దర్శకుడు వశిష్ఠ్‌ తాతగారు ఎన్టీఆర్‌కి చాలా పెద్ద ఫ్యాన్‌. ఆ అభిమానంతోనే ఈ సినిమాలో ఆనాటి గుర్తులు కనిపించొచ్చు అని చెప్పారు.

దీంతో కచ్చితంగా పెద్దయన సినిమాలు, ఆయన రిఫరెన్స్‌లు సినిమాలో ఉంటాయి అని ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. మరి ఇలాంటి సినిమా చేశారు ఎన్టీఆర్‌ సినిమాలు రీమేక్‌ చేస్తారా అని అడిగితే.. అలాంటి సినిమా చేయాలనే ఆలోచనే నాకు అసలు లేదు. ఆయనొక ఒక లెజెండ్‌. ఆయన సినిమాలను రీమేక్‌ చేయడమంటే సాహసమనే చెప్పాలి అని అన్నారు. తాత సినిమాలను రీమేక్‌ చేయాలంటే తారక్‌ కూడా ఇలాంటి సమాధానమే చెబుతూ ఉంటాడు. ఇప్పుడు అన్న కల్యాణ్‌రామ్‌ కూడా ఇదే మాట అన్నాడు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus