Bimbisara2 Story: అసలు కథంతా బింబిసార2 లోనే ఉంది : కళ్యాణ్ రామ్

ఈ మధ్య కాలంలో కొత్త సినిమాల ప్రమోషన్లు కొత్త పుంతలు తొక్కుతున్న సందర్భాలను మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ నుండీ ఒక సినిమా ప్రమోషన్ లో మరో దర్శకుడు భాగం అయ్యి ఆ సినిమాని మరింత ముందుకు తీసిలుకెళ్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్లలో అనిల్ రావిపూడి పాల్గొన్నాడు. ఆచార్య ప్రమోషన్ లో హరీష్ శంకర్ పాల్గొన్నాడు. విక్రమ్ సినిమా ప్రమోషన్ లో వెంకీ కుడుముల పాల్గొన్నాడు. ఇప్పుడు బింబిసార కొసం వినాయక్ కదిలొచ్చాడు.

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ మూవీ మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మల్లిడి వశిష్ట్ ఈ చిత్రానికి దర్శకుడు. మొదటి సినిమాతోనే అతను టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. అయితే బింబిసార మూవీకి సీక్వెల్ కూడా ఉంటుంది అని ముందుగానే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే చివర్లో బింబిసార చనిపోయినట్టు చూపించారు. కానీ సంజీవని పుష్పం ద్వారా అతను బ్రతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

అది పక్కన పెట్టేస్తే సెకండ్ పార్ట్ లో బింబిసారుడి గతాన్ని చూపించబోతున్నారు అని దర్శకుడు, హీరో చెప్పుకొచ్చారు. అతను ఎందుకు తన తమ్ముడిని చంపాడు, ఎన్ని రాజ్యాలను కొల్లగొట్టాడు. అతనిలో ఇంకా ఎంత కృయాలిటీ దాగి ఉంది అనే అంశాలను చూపించబోతున్నారట. అందుకు చాలా బుడ్జెట్ పెట్టాల్సి ఉందని తెలిపారు.

ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ నాకు అంత మార్కెట్ లేదు అని ఆలోచించాము అంటూ దర్శకుడు వినాయక్ కు చెప్పుకొచ్చాడు. అందుకు వినాయక్ ‘ నీకు ఇప్పుడు ఉంది మార్కెట్ ‘ అంటూ కళ్యాణ్ రామ్ కు చెప్పాడు.దర్శకుడు మల్లిడి వశిష్ట్ తండ్రి సత్యనారాయణ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన బన్నీ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus