ఒకే ఫ్రేమ్‌లో కమల్ హాసన్, చిరు, బాలయ్య, నాగార్జున.. వైరల్ అవుతున్న ఈ ఫోటో ఎప్పటిదంటే..?

విశ్వనటుడు కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, యువసామ్రాట్ నాగార్జున.. ఈ నలుగురు స్టార్స్ ఒకే ఫ్రేములో కనిపిస్తే ప్రేక్షకాభిమానులకు ఫుల్ కిక్క్.. షూటింగ్స్‌తో బిజీగా ఉండే స్టార్లందరూ ఇలా కలవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది.. అలా వీరు కలిసిన రేర్ పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.. ఈ ఫోటో దాదాపు 35 సంవత్సరాల క్రితం తీసినది.. బాలకృష్ణ, రజినీ, శారద, జగ్గయ్య ప్రధాన పాత్రల్లో.. వై. నాగేశ్వర రావు దర్శకత్వంలో డి. రామా నాయుడు ‘రాము’ అనే సూపర్ హిట్ పిక్చర్ నిర్మించారు..

ఎస్.పి. బాలు ఈ సినిమాకి సంగీతమందించారు.. ‘రాము’ 100 డేస్ ఫంక్షన్‌కి చిరు, కమల్, నాగ్ ముఖ్య అతిథులుగా వచ్చినప్పుడు క్లిక్‌ ‌మనిపించిన బ్యూటిఫుల్ పిక్ ఇది.. ఆ సమయంలో కమల్ ‘సత్య’ సినిమా చేస్తున్నారు.. ఆయన గెటప్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.. అప్పటి అరుదైన ఇమేజ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus