Kamal Haasan: కమల్ రిక్వెస్ట్ ని కాదన్న నటుడు..!
- May 29, 2022 / 07:22 PM ISTByFilmy Focus
చాలా కాలం తరువాత కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లాంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలానే నటుడు సూర్య క్యామియో రోల్ లో కనిపించనున్నారు. జూన్ 3న ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు.
ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఇతర నటీనటులతో కలిసి నటించడమంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. నటుడు దిలీప్ కుమార్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయనతో నటించే అవకాశం కోల్పోవడం గురించి చెప్పుకొచ్చారు. తను నటించాలని కోరుకొని.. అలా నటించని నటుడు ఒకరున్నారని.. ఆయనే దిలీప్ కుమార్ సార్ అని అన్నారు కమల్. ‘తేవర్ మగన్’ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకున్నప్పుడు..

తనతో కలిసి నటించమని దిలీప్ కుమార్ ని రిక్వెస్ట్ చేయడానికి ముంబై వెళ్లారట కమల్. దిలీప్ కుమార్ చేతులు పట్టుకొని మరీ ఆ సినిమాలో నటించమని ప్రాధేయపడ్డారట. కానీ ఆయన మాత్రం ఒప్పుకోలేదని చెప్పారు కమల్. ఆ తరువాత అదే సినిమాను బాలీవుడ్ లో అనిల్ కపూర్, అమ్రిష్ పురి కాంబినేషన్ లో ‘విరాసత్’గా తెరకెక్కించారు.

కమల్ హాసన్ లాంటి నటుడితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మంది తారలు కోరుకుంటారు. అలాంటిది ఆయన రిక్వెస్ట్ చేసినా.. ఒప్పుకోలేదు దిలీప్ కుమార్. గతేడాది అనారోగ్యంతో దిలీప్ మరణించిన సంగతి తెలిసిందే!
ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!












