Kamal Haasan: సినిమా రిలీజైన పది రోజుల తరువాతే చూస్తా: కమల్

లోకనాయకుడు కమల్ హాసన్ చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు ఇండియన్ స్క్రీన్ పై మరో హీరో చేయలేదు. మరి ఈ విలక్షణ నటుడు తన సినిమాను తాను థియేటర్లో చూసుకుంటారా..? తన సినిమా విడుదలైన మొదటి రోజు కమల్ హాసన్ పరిస్థితి ఏంటి అనే విషయాలపై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారాయన. తన ప్రతి సినిమాను మొదటిరోజు థియేటర్లో చూడాలనుకుంటానని.. కానీ వెళ్లనని చెప్పారు.

తను పెద్ద స్టార్ అనే పొగరుతో థియేటర్ కి వెళ్లడం ఆపేయలేదని.. థియేటర్లో ఉన్నానని తెలిస్తే ఫోకస్ మొత్తం తన వైపు మారిపోతుందని.. జనాలు స్క్రీన్ చూడకుండా వెనక్కి తిరిగి చూడడం మొదలుపెడతారని.. వాళ్లను డిస్టర్బ్ చేసినట్లు అవుతుందని చెప్పుకొచ్చారు. అందుకే సినిమా విడుదలైన పది రోజుల తరువాత థియేటర్ కు వెళ్తానని చెప్పుకొచ్చారు.

ఇక సినిమా రిజల్ట్ గురించి ఎప్పుడూ ఆలోచించనని చెప్పారు కమల్. చేసిన పాత్రకు న్యాయం చేశామా..? లేదా..? అనేది మాత్రమే చూస్తానని.. కమర్షియల్ లెక్కలు చూడనని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం కమర్షియల్ గా సక్సెస్ కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సందర్భంగా తను చేయాల్సిన పాత్రలపై కూడా స్పందించారు. తను చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయని.. 231 సినిమాలు చేశానని.. అది జస్ట్ నెంబర్ మాత్రమేనని అన్నారు.

అందులో పెద్ద అర్ధం ఉన్నట్లు తనకు అనిపించలేదని.. వీటిలో 30-32 సినిమాల్లో నటుడిగా ప్రూవ్ చేసుకున్నానేమో.. కాస్త కొత్తగా ఉన్నాయేమో అని చెప్పుకొచ్చారు. కాబట్టి చేయాల్సిన పాత్రలు చాలానే ఉన్నాయని.. కాకపోతే ఫలానా టైపులో కావాలని అడిగే మేకర్స్ చాలా తక్కువమంది ఉన్నారని అన్నారు. ఈరోజు విడుదలైన ‘విక్రమ్’ సినిమా అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus