ప్రోస్థటిక మేకప్ అంటే.. భారతీయ సినిమాల్లో ఠక్కున గుర్తొచ్చేది కమల్ హాసన్. అంతలా ఆ మేకప్ విధానాన్ని భారతీయ సినిమాలో చూపించారు కమల్ హాసన్. ‘భామనే సత్య భామనే’, ‘భారతీయుడు’, ‘దశావతారం’.. ఇలా చాలా సినిమాల్లో ఆయన ప్రోస్థటిక్ మేకప్ విధానన్ని ఉపయోగించారు. అయితే ఆయన మేకప్ వేసుకోవడం కాదు, మేకప్ వేశారు అని తెలుసు. అందులో అది సిల్వర్‌స్టర్ స్టాలోన్‌కి. అవును ఈ విషయాన్ని ఆయన ఇటీవల వెల్లడించారు.
‘విక్రమ్’ సినిమా ప్రచారం కోసం కమల్ హాసన్ ఇటీవల బాలీవుడ్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో తన పాత సినిమాల గురించి కీలక విషయాలను పంచుకున్నారు. అప్పుడే ‘రాంబో 3’ సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే ఆ సినిమాకు కమల్ హాసన్ మేకప్ విభాగంలో పని చేశారు. ‘రాంబో 3’ హీరో సిల్వర్‌స్టర్ స్టాలోన్ ప్రోస్ఠటిక్ మేకప్‌లో కొంత పార్టు కమల్ హాసన్ చేశారట. స్టాలోన్ ముఖం మీద బొడిపెలు లాంటివి కమల్ పెట్టారట.
ఆ సమయంలో కమల్ ఓ సినిమా కోసం ప్రోస్ఠటిక్ మేకప్ వేసేవాళ్లు కావాలని అనుకున్నారట. ఎవరైనా నేర్చుకుంటే సినిమాకు పనికొస్తుందని అనుకున్నారట. అయితే ఈ కోర్సు గురించి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదంట. దీంతో కమల్ హాసనే స్వయంగా ముందుకొచ్చి ప్రోస్ఠటిక్ మేకప్ కోర్సు నేర్చుకున్నారట. ఈ క్రమంలోనే ‘రాంబో 3’ సినిమాలో పని చేశారట. సుమారు నెలన్నరపాటు ఆ సినిమాలో మేకప్ టీమ్‌లో ఉన్నానని కమల్ చెప్పారు.
కమల్ మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుందో, ఎంత నమ్మశక్యంగా ఉంటుందో మనం చాలా సినిమాల్లో చూశాం. ఓసారి ‘భామనే సత్యభామనే’ సినిమాలో రుక్మిణి బామ్మగా మారాక.. మేకప్ వేసుకొని కమల్ సెట్‌లోకి వచ్చారట. నెక్స్ట్ సీన్‌ను వివరించడానికి అసిస్టెంట్ డైరక్టర్ కమల్ దగ్గరకు వచ్చారట. సీన్ చెబుతుంటే అతని చేతులు వణికిపోతున్నాయట. దీంతో ఏమైంది, అంతా ఓకేనా అని అడిగారట కమల్.
సీన్ వింటున్న క్రమంలో కమల్ వంటి మీద పైట జారి కింద పడిందట. పైటను చూసి ఆ ఏడీ చేతులు వణికాయట. ఆ విషయం తెలిసి కమల్ తిరిగి పైటను సర్దుకోవడంతో మళ్లీ సీన్ వివరించడం మొదలుపెట్టాడట ఆ ఏడీ. ఈ విషయాన్ని కమల్ ఇటీవల చెప్పుకొచ్చారు.