Hey Ram: కమల్ – షారుఖ్ ల ‘హే రామ్’ సినిమా ప్రోమోలు..ఇప్పుడు ఎందుకబ్బా?

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ‘హే రామ్’ అనే సినిమా రూపొందింది. 2000 సంవత్సరంలో ఈ చిత్రం విడుదలైంది. కమల్ హాసన్ నటించడమే కాకుండా నిర్మాతగా,దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కూడా నటించడం జరిగింది. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే.. ఇండియాలో రిలీజ్ అవ్వకుండా బాన్ చేసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పాలి. ఎందుకంటే ‘హే రామ్’ లో మహాత్మా గాంధీజీ వంటి గొప్ప వ్యక్తి గురించి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి అని అప్పట్లో కోర్టులో కేసులు వేసిన వారు ఉన్నారు.

అందుకే సినిమా ‘హే రామ్’ (Hey Ram) సినిమా రిలీజ్ చేయకూడదు అంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మంచి టాక్ వచ్చినా ఎందుకో కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. తమిళ్ తో పాటు, హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రెండు చోట్లా ఒక్కటే రెస్పాన్స్ వచ్చింది. అయితే కంటెంట్ కి తగ్గట్టు 3 నేషనల్ అవార్డులు లభించాయి. ఆస్కార్ నామినేషన్స్ కి కూడా పంపించారు.

కానీ రిజెక్ట్ అయ్యింది.ఇది పక్కన పెడితే.. కమల్ హాసన్ – రాణి ముఖర్జీ మధ్య వచ్చే లిప్ లాక్ సన్నివేశాలు, బెడ్ రూమ్ సన్నివేశాలు కూడా వివాదాస్పదమయ్యాయి. 23 ఏళ్ళ తర్వాత ఈ సినిమా టాపిక్ ఎందుకు అనే డౌట్ అందరికీ రావచ్చు. ఆ విషయం పై నిజంగానే క్లారిటీ లేదు. మేకర్స్ నిన్న ఆగస్టు 15 సందర్భంగా యూట్యూబ్ లో హిందీ వెర్షన్ ఒరిజినల్ ప్రింట్ ను విడుదల చేసింది. తమిళ వెర్షన్ ఒరిజినల్ ప్రింట్ ను కూడా విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చేయడం జరిగింది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus