యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) , స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్లో 1987 లో వచ్చిన ‘నాయగన్’ తర్వాత ‘థగ్ లైఫ్’ (Thug Life) రూపొందింది. ‘రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్’ ‘మద్రాస్ టాకీస్’ ‘రెడ్ గయంట్’ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, శివ అనంత్ (Siva Ananth), ఆర్.మహేంద్రన్ (R Mahendran) సంయుక్తంగా ఈ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి నిర్మించారు. మరో తమిళ స్టార్ హీరో శింబు (Silambarasan) కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
త్రిష (Trisha) , అభిరామి (Abhirami) హీరోయిన్లు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అది ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ట్రైలర్ లో రవి కె చంద్రన్ (Ravi K. Chandran) సినిమాటోగ్రఫీ, అభిరామి..త్రిష..లతో కమల్ రొమాన్స్ వంటివి ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా జూన్ 5న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసింది.
నెట్ ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ తీసుకుంటే.. నెల రోజుల వ్యవధిలో స్ట్రీమింగ్ అవుతుంది అని అంతా భావిస్తారు. కానీ ‘థగ్ లైఫ్’ మాత్రం అలా స్ట్రీమింగ్ కాదు అని తెలుస్తుంది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన 8 వారాల తర్వాతే ఓటీటీలో అందుబాటులోకి వస్తుందట. జూలై నెలాఖరు వరకు ‘థగ్ లైఫ్’ ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదు. థియేటర్ వ్యవస్థను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇటీవల ఓ కార్యక్రమంలో కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.