‘లైగర్’ (Liger) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) ఇచ్చిన షాక్..ల తర్వాత పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) .. త్వరగా సినిమా సెట్ చేసుకోలేకపోయాడు. అతనితో సినిమాలు చేయడానికి హీరోలు ఎవ్వరూ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఒక దశలో నాగార్జున(Nagarjuna), గోపీచంద్ (Gopichand)..లతో సినిమాలు సెట్ అయ్యాయి అనుకున్నారు. కానీ వాళ్ళు వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల పూరీకి ఛాన్స్ ఇవ్వలేకపోయారు. అయితే తమిళ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) పూరీని నమ్మాడు. అతను చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చేసేశాడు.
తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్యువల్ మూవీగా రూపొందుతుంది ఈ సినిమా. పూరీకి ఈ సినిమా ‘డు ఆర్ డై’ వంటిది. ఫలితం తేడా కొడితే విజయ్ సేతుపతికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఒక వేళ ఇది సూపర్ హిట్ అయితే తెలుగులో అతని మార్కెట్ మరింత పెరుగుతుంది. ఒకవేళ ఆడకపోతే ఎప్పటిలానే అతని ఇమేజ్ అతనికి ఉంటుంది.కానీ పూరీకి అలా కాదు. ఈ సినిమాతో సక్సెస్ కొట్టి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉంది.
ఇదిలా ఉంటే.. ఈరోజు ‘ఏస్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన విజయ్ సేతుపతి.. మీడియాతో ముచ్చటించాడు.మే 23న ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో పూరీతో చేస్తున్న సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. ఆ సినిమాకి ‘బెగ్గర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై విజయ్ సేతుపతి స్పందిస్తూ… “టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు.
మీరే ఫిక్స్ చేశారా ‘బెగ్గర్’ అని..!ఎవరో ఏఐ(artificial intelligence) వాడి ఆ పోస్టర్ చేశారు. మనం చేయించింది కాదు. పూరీ గారి ఆలోచన విధానం, స్క్రిప్ట్ రాసే విధానం నాకు బాగా నచ్చింది. ఆయన సినిమాలు కూడా చూశాను. ఆయనతో పని చేయాలి అని నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. ఇంతకు మించి నేను ఏమీ చెప్పకూడదు” అంటూ చెప్పుకొచ్చాడు.
‘బెగ్గర్’ టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు.. పూరి సార్ అంటే నాకు చాలా రెస్పెక్ట్#VijaySethupathi #Rukmini #SamCS #PuriJagannadh pic.twitter.com/Vm5OcYATLR
— Filmy Focus (@FilmyFocus) May 21, 2025