దశావతారం సినిమా తర్వాత కమల్ హాసన్ నటించిన సినిమాలలో ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. భారీస్థాయిలో ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ కమల్ క్రేజ్ అంతకంతకూ తగ్గింది. అయితే విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ ఫామ్ లోకి వచ్చారు. తొలిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించగా న్యూట్రల్ ఆడియన్స్ కు సైతం ఈ సినిమా ఎంతగానో నచ్చింది. లోకేష్ కనగరాజ్ ఈ సినిమా సక్సెస్ తో దర్శకుడిగా మరో మెట్టు పైకి ఎక్కారు.
ఓటీటీ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఆరు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని బోగట్టా. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది. ఆలస్యంగానే ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు భారీగానే కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సూర్య గెస్ట్ రోల్ లో కనిపించడం ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించడం ఈ సినిమాకు ఒకింత ప్లస్ అయింది.
నితిన్ ఈ సినిమా హక్కులను 6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని నిర్మాతగా ఈ సినిమా నితిన్ కు మంచి లాభాలను అందిస్తోందని తెలుస్తోంది. ఈ వీకెండ్ నాటికి ఈ సినిమా దాదాపుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. ఎఫ్3 సినిమా హవా తగ్గడంతో మేజర్, విక్రమ్ సినిమాలకు ప్లస్ అవుతోంది. వరుసగా సినిమాలు సక్సెస్ సాధిస్తుండటంతో ఇండస్ట్రీ కళకళలాడుతోంది.
సౌత్ సినిమాలు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సౌత్ దర్శకులు తమ ప్రతిభతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్నారు. కమల్ తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.