రాజకీయాల ముందు సినిమాలు చాలా ఈజీ అంటుంది ఓ హీరోయిన్. ఈ కామెంట్స్ చేసింది మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ . ఆమెను బాలీవుడ్లో అందరూ ఫైర్ బ్రాండ్ అంటుంటారు. బాలీవుడ్ నెపోటిజంనే ఈమె లెక్క చేయకుండా స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం.ఎవరినీ లెక్క చేయని మనస్తత్వం.. కంగనాకి ఎక్కువ. అలాంటి ఆమెను రాజకీయాలే కష్టబెట్టాయా? లేదా ఇబ్బంది పెట్టాయా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అందుకే ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని ‘మండి’ నియోజకవర్గం నుండీ బీజేపీ అభ్యర్థిగా కంగనా పోటీ చేస్తుంది. ఈ క్రమంలో చేసిన ప్రచారం పై తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘ఎంత సేపూ రోడ్ షో లు, బహిరంగ సభలు, పార్టీ అధికారులతో మీటింగులు, రోజులో 450 కి.మీల ప్రయాణాలు, నిద్రలేని రాత్రులు, సమయానికి భోజనం చేయకపోవడం’ వంటివి ఈమెను బాగా ఇబ్బంది పెట్టాయట. అంతేకాదు ‘రాజకీయాలంటే జనాలకి ఫేక్ హోప్స్ ఇవ్వాలి, వాళ్ళ గడ్డం పట్టుకుని ఓటు వేయాలని బ్రతిమిలాడాలి.
అది తన వ్యక్తిత్వానికి వ్యతిరేకం’ అనే ఆలోచనలో కూడా కంగనా ఉంది. అందుకే రాజకీయాల కంటే సినిమాల్లో నటించడం ఈజీ అని ఆమె రాసుకొచ్చింది. ఇక సినిమాల పరంగా చూసుకుంటే.. ఆమె ఇందిరా గాంధీ బయోపిక్ అయినటువంటి ‘ఎమర్జెన్సీ’ (Emergency) లో నటిస్తుంది. అంతేకాదు ఈ చిత్రాన్ని స్వయంగా ఆమె (Kangana Ranaut) డైరెక్ట్ చేస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఎలక్షన్స్ వల్ల ఆ సినిమా రిలీజ్ వాయిదా పడింది.