బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా వివాదాస్పద అంశాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆదాయపు పన్ను చెల్లించలేకపోతున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది కంగనా. కరోనా, లాక్ డౌన్ కారణంగా గతేడాదిగా షూటింగ్ లో పాల్గొనలేదని.. దీంతో సరిపడా డబ్బులు లేక పూర్తి స్థాయిలో పన్ను చెల్లించలేదని ఆమె తెలిపింది. ఈ క్రమంలో ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
తన మొత్తం ఆదాయంలో 45 శాతం వరకు పన్ను రూపంలో చెల్లిస్తున్నట్లు చెప్పిన కంగనా.. అత్యధిక మొత్తంలో పన్ను చెల్లించే నటి తనేనంటూ చెప్పుకొచ్చింది. అయితే ఏడాదిగా ఉపాధి లేకపోవడంతో చేతిలో డబ్బు లేక ఇంకా సగం పన్నుని చెల్లించలేకపోయానని.. దీంతో అదనపు ఛార్జీలు కట్టాల్సి వస్తోందని.. తెలిపింది. ఇలా పన్ను చెల్లించడంలో ఆలస్యం చేయడం తన జీవితంలో ఇదే తొలిసారి అంటూ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా కంగనా మాస్క్ లేకుండా బయట తిరగడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
షూటింగ్ లు జరగని ఈ ఏడాది కాలంలో కంగనా చాలా వివాదాల్లో జోక్యం చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బీజేపీకు మద్దతు తెలుపుతూ.. మిగిలిన పార్టీలకు వ్యతిరేకంగా ఆమె చేసిన ట్వీట్లు వివాదాస్పదమయ్యాయి. కొన్ని ట్వీట్లలో కంగనా హద్దులు దాటి కామెంట్స్ చేయడంతో ట్విట్టర్ సంస్థ ఆమె అకౌంట్ ను శాశ్వతంగా రద్దు చేసింది.