Kangana Ranaut: రాజమౌళిపై కంగన కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

  • March 31, 2022 / 10:18 AM IST

కంగన రనౌత్‌ ఏం చేసినా హుషారుగానే ఉంటుంది. ఎంత కోపమవుతుందో, అంతే ప్రేమను చూపిస్తుంది. అయితే ఆమెలో ఈ రెండో యాంగిల్‌ చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే బాలీవుడ్‌లో ఆమెకు నచ్చేవాళ్లు చాలా తక్కువమంది కాబట్టి. అయితే దక్షిణాదిలో ఆమెకు ఎక్కువమందే నచ్చుతారు. అందులో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్‌.రాజమౌళి ఒకరు. ఆయన దర్శకత్వంలో ఇటీవల విడుదలైన చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’. ఈ సినిమా గురించి ఇటీవల కంగన కొన్ని కామెంట్స్‌ చేసింది. ఇప్పుడవి వైరల్‌గా మారాయి.

Click Here To Watch NOW

ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాజమౌళి ఫొటోను షేర్‌ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించింది కంగనా రనౌత్‌. ‘‘రాజమౌళి భారతీయ చలన చిత్రపరిశ్రమలో గొప్ప దర్శకుడని మరోసారి నిరూపించుకున్నారు. ఆయన కెరీర్‌లోనే ప్లాప్‌ సినిమాలు లేవు. భవిష్యత్తులో ఉండవు కూడా’’ అని రాసుకొచ్చింది కంగన. మరో పోస్ట్‌లో ‘‘రాజమౌళి సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ మాత్రమే కాదు, మానవత్వం ఉన్న గొప్ప మనిషి కూడా. దేశంపై, నమ్ముకున్న ధర్మంపై ఆయన చూపించే ప్రేమ చాలా గొప్పది’’ అని రాసుకొచ్చింది కంగన.

మీ లాంటి రోల్‌ మోడల్‌ ఉండటం నా అదృష్టం సార్‌. నిజాయితిగా నేను మీకు పెద్ద అభిమానిని అంటూ రాజమౌళిని ఆకాశానికెత్తేసింది. ఆఖరిగా రేపు కుటుంబంతో కలసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూడటానికి వెళ్తున్నాను. మరి మీరేప్పుడు చూస్తారు అని రాసుకొచ్చింది. అంటే ‘ఆర్ఆర్ఆర్‌’ చూడకుండానే కంగన ఇవన్నీ మాట్లాడింది అన్నమాట. సినిమా చూశాక మరో రౌండ్‌ పొగడ్తలు ఉంటాయి అనుకోవచ్చు. ఇక ఈ సినిమా గురించి చూస్తే.. తొలుత కాస్త మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

రూ. 500 కోట్లు దాటి రూ. 750 కోట్లవైపు దూసుకుపోతున్నాయి వసూళ్లు. బాలీవుడ్‌లో తొలి రెండు రోజులు కాస్త తక్కువగా కనిపించిన సినిమా ప్రభావం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో బాలీవుడ్‌లో రూ. 200 కోట్లవైపు వెళ్తోంది. అన్నట్లు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఇటీవల కాలంలో కంగన కోసం వరుస కథలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కంగన చేస్తున్న ‘సీత’ కథ కూడా ఆయనదే.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus