నా శత్రువులకు ఎప్పుటీకీ కృతజ్ఞతతో ఉంటా!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. కాంట్రవర్సీకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటంతో పెద్ద ఎత్తున వివాదాలలో నిలుస్తూ ఉంటారు. ఇలా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి కంగనా నేడు తన 36వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ తన అభిప్రాయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నన్ను ఎప్పుడు విశ్రాంతి తీసుకోనివ్వని నా శత్రువులు నేను ఎంత సక్సెస్ సాధించిన నన్ను నా కాళ్ళ మీద నిలబడేలా నన్ను విజయపతంలో ముందుకు నడిపించారు. వారే నాకు పోరాటం నేర్పించారు. నేను ఎప్పటికీ నా శత్రువులకు కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు. నా ప్రవర్తన నా ఆలోచనలు ఎప్పుడు సరళమైనవి నేను ఎప్పుడు ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటాను. నేను దేశ సంక్షేమం గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు.

ఇలా నేను దేశ సంక్షేమం కోసం మాట్లాడినటువంటి మాటలలో కేవలం మంచి ఆలోచనలు మాత్రమే ఉన్నాయని ఈమె తెలిపారు. ఇలా తన పుట్టినరోజు సందర్భంగా కంగనా షేర్ చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల విషయానికొస్తే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు అయితే ఈమె బాలీవుడ్ సినిమాల కన్నా ప్రస్తుతం సౌత్ సినిమాలపై ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలోనే ఈమె రాఘవ లారెన్స్ హీరోగా నటించిన చంద్రముఖి 2 సినిమాలో జ్యోతిక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాలో తన షూటింగ్ పార్ట్ ఈమె పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus