Kanguva: ఈ టాక్ తో ‘కంగువా’ అంత రాబట్టే అవకాశం ఉందా?

సూర్య (Suriya) హీరోగా దిశా పటాని (Disha Patani) హీరోయిన్ గా తెరకెక్కిన ‘కంగువా’ (Kanguva) చిత్రం భారీ అంచనాల నడుమ ఈరోజు తమిళ,తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు సినిమాకి భారీ హైప్ ఉంది. కానీ టాక్ మాత్రం నెగిటివ్ గా ఉంది. దర్శకుడు శివ (Siva)  మంచి కథని తీసుకున్నప్పటికీ దానిని సరిగ్గా డీల్ చేయలేకపోయాడు అనే కంప్లైంట్ ఆడియన్స్ నుండి అందుతోంది. అయితే ముందు నుండి ఉన్న హైప్ కారణంగా డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి.

Kanguva

టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘కంగువా’ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.3.2 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసే అవకాశం ఉంది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.7 కోట్ల వరకు ఉండవచ్చు. అడ్వాన్స్ బుకింగ్స్ ను ఆధారం చేసుకొని చెబుతున్న నెంబర్లు ఇవి. ఒకవేళ కౌంటర్ వద్ద టికెట్లు బాగా తెగితే..

అంటే ఆఫ్ లైన్ టికెట్స్ బెటర్ గా బుక్ అయితే, ఆ లెక్క ఇంకో రూ.50 లక్షలు పెరగొచ్చు. తమిళంలో ఈ సినిమాకి ఎందుకో థియేటర్లు దొరకలేదు. కానీ లిమిటెడ్ థియేటర్స్ లో కూడా బాగానే బుకింగ్స్ జరుగుతున్నాయి. అక్కడ మొదటి రోజు ఈ సినిమా రూ.11 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసే అవకాశం ఉంది. హిందీలో అంతగా జోరు చూపించడం లేదు.

అయితే ఈవెనింగ్ షోలకు అక్కడ కూడా బుకింగ్స్ బెటర్ అయ్యాయి అంటున్నారు. ఓవర్సీస్ లో రూ.15 కోట్ల వరకు గ్రాస్ రావచ్చు. కర్ణాటక, కేరళ వంటి ఏరియాల్లో రూ.8 కోట్లు గ్రాస్ రావచ్చు. ఈ అన్ని ఏరియాల్లోనూ ఆఫ్లైన్ సేల్స్ బాగుంటే రూ.50 కోట్ల గ్రాస్ మార్క్ కి దగ్గరగా వెళ్లే ఛాన్స్ ఉంది. మరి అఫీషియల్ కలెక్షన్స్ ఈ రేంజ్లో ఉంటాయో లేదో మరికొన్ని గంటల్లో క్లారిటీ వస్తుంది.

‘పుష్ప 2’ లో ఆ ఫైట్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus