ప్రముఖ నటికి కాబోయే భర్త ఎవరంటే..?

సెలబ్రిటీల వెడ్డింగ్స్‌కి సంబంధించి న్యూస్ అంటే వద్దన్నా కానీ వైరల్ అవుతుంటుంది. ఇప్పటికే కాజల్ అగర్వాల్, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లు ఎంచక్కా పెళ్లిళ్లు చేసుకుని అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నారు.. ‘దేశముదురు’ ముద్దుగుమ్మ హన్సిక కూడా ఈమధ్యనే తనకి కాబోయే వరుణ్ణి పరిచయం చేసింది. మరోవైపు మిల్కీబ్యూటీ తమన్నా పెళ్లి గురించి అయితే రకరకాల వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో పాపులర్ యాక్ట్రెస్ పెళ్లి పీటలెక్కుతోంది..అతిథి ప్రభుదేవా.. కన్నడలో స్టార్ హీరోయిన్..

చాలా డిమాండ్ ఉన్న నటి.. 28 ఏళ్ల అతిథి వివాహం సోమవారం (నవంబర్ 28) బెంగుళూరులోని ప్యాలెస్ మైదానంలో జరుగనుంది. ఆమె అసలు పేరు సుదీపన బనకర్ ప్రభుదేవా.. సీరయల్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన అతిథి 2017లో కన్నడ మూవీ ‘ధైర్యం’ తో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యింది. ‘బజార్’, ‘రంగనాయకి’, ‘బ్రహ్మచారి’, ‘తోతాపురి’ లాంటి చిత్రాలు చేసి.. కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవడమే కాక.. శాండల్ వుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్‌గా మారిపోయింది.

గ్లామరస్ క్యారెక్టర్లలోనూ ఆకట్టుకుంది. అతిథి, కాఫీ బిజినెస్‌లో స్థిరపడ్డ యశస్‌ని పెళ్లాడనుంది. ఆదివారం (నవంబర్ 27)న బెంగుళూరులో జరిగిన వీరి రిసెప్షన్‌కి పలువురు కన్నడ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విచ్చేసి.. శుభాకాంక్షలు తెలియజేశారు. అతిథి ప్రభుదేవా, యశస్‌లది పెద్దలు కుదిర్చిన వివాహం.. ఇటీవలే తను కథానాయికగా నటిస్తున్న ఐదు చిత్రాలు పూర్తి చేసింది. ప్రస్తుతం తన చేతిలో రెండు కన్నడ సినిమాలున్నాయి. అయితేే కెరీర్ పీక్స్‌లో ఉండగానే అతిథి పెళ్లి చేసుకోవడంతో..

ఇకముందు సినిమాలలో కనిపించదేమోనని ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు. ‘‘2017లో మొదలు పెడితే 2022 వరకు కేవలం ఐదు సంవత్సరాలకే అతిథి ఇలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకుందేంటి?.. నటిగా బిజీగానే ఉంది.. వరుసగా క్రేజీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి.. తనకిప్పుడు ఏమంత వయసైపోయిందని?’’.. అంటూ డైహార్డ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అతిథి ప్రభుదేవా పెళ్లి న్యూస్, పిక్స్.. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus