టాలీవుడ్ హీరోలకు ఆ స్టార్ హీరో షాకిచ్చారా?

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమాతో కన్నడ హీరో యశ్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. కేజీఎఫ్ ఛాప్టర్2 కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ కానుంది. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలతో పోలిస్తే ఈ హీరోకే క్రేజ్ ఎక్కువని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో పదుల సంఖ్యలో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి.

అయితే ఈ సినిమాలలో ఏ సినిమా తొలిరోజు భారీస్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందనే ప్రశ్నకు సినీ విశ్లేషకుల నుంచి కేజీఎఫ్ ఛాప్టర్2 అనే సమాధానం వినిపిస్తోంది. కేజీఎఫ్2 తర్వాత స్థానాల్లో ఆర్ఆర్ఆర్, ఆదిపురుష్ సినిమాలు ఉన్నాయి. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ లకు ఇతర భాషల్లో క్రేజ్ బాగానే ఉన్నా యశ్ క్రేజ్ తో పోలిస్తే ఆ క్రేజ్ తక్కువేనని సమాచారం. కేజీఎఫ్2 రిలీజైన తర్వాత ఎన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

కేజీఎఫ్2 సక్సెస్ సాధిస్తే దర్శకునిగా ప్రశాంత్ నీల్ కు సైతం క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కేజీఎఫ్2 ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ ఏడాదే కేజీఎఫ్2 రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా వాయిదా పడింది. సలార్ రిలీజ్ డేట్ కు కేజీఎఫ్2 సినిమాను రిలీజ్ చేస్తున్న ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాల్సి ఉంది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus