కన్నడ పవర్ స్టార్ పేరును టాటూ వేయించుకున్న సోదరుడు.. ఫోటో వైరల్!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ భౌతికంగా మరణించినా సినిమాల ద్వారా, సేవా కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజల హృదయాల్లో జీవించి ఉన్నారు. ఆయన మరణించి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతున్నా ఎక్కడో ఒకచోట ఆయన పేరు వినిపిస్తూ ఉండటంతో ఆయన అభిమానులు సైతం మరిచిపోలేకపోతున్నారు. వివాదాలకు దూరంగా ఉండే పునీత్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలతో కూడా మంచి అనుబంధం ఉంది. పునీత్ సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ తమ్ముడిపై ప్రేమతో తమ్ముడి పేరును టాటూగా వేయించుకున్నారు.

ఏదైనా సినిమా ఈవెంట్ కు రాఘవేంద్ర రాజ్ కుమార్ హాజరైతే సోదరుడి గురించి చెబుతూ ఎమోషనల్ అవుతున్నారు. రాఘవేంద్ర రాజ్ కుమార్ పునీత్ ను సొంత కొడుకులా చూసుకునేవారు. రాఘవేంద్ర రాజ్ కుమార్ కు పునీత్ అంటే ఎంత ఇష్టమంటే ఎక్కడైనా పునీత్ ఫోటోను చూస్తే ఆయన వెంటనే ఎమోషనల్ అవుతారు. పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సమయంలో రాఘవేంద్రను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.

తమ్ముడి జ్ఞాపకాలను తరచూ గుర్తు చేసుకునే రాఘవేంద్ర రాజ్ కుమార్ తన ఛాతీపై అప్పు అనే పేరును టాటూగా వేయించుకోవడం గమనార్హం. పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమాలో రాఘవేంద్ర అతిథి పాత్రలో నటించి మెప్పించారు. పునీత్ నిక్ నేమ్ అయిన అప్పుతో పాటు నుక్కి, టోటో అనే పేర్లను సైతం రాఘవేంద్ర రాజ్ కుమార్ పచ్చబొట్టు వేయించుకున్నారు. ఈ పేర్లు పునీత్ ఇద్దరు కూతుళ్ల ముద్దుపేర్లు కావడం గమనార్హం.

రాఘవేంద్ర రాజ్ కుమార్ కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించడం గమనార్హం. ప్రస్తుతం ఈ నటుడి వయస్సు 57 సంవత్సరాలు కాగా సింగర్ గా కూడా రాఘవేంద్ర గుర్తింపును సొంతం చేసుకున్నారు. పునీత్ (Puneeth) చేసిన మంచి పనులను ఎప్పటికీ మరిచిపోలేమని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus