Mahesh Babu: కన్నడ నిర్మాతలకు మహేష్ ఓకే చెబుతారా?

తెలుగులోని టాప్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. తన సినిమా వల్ల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వస్తే ఆదుకునే విషయంలో మహేష్ బాబు ముందువరసలో ఉంటారు. మహేష్ డిమాండ్ కు అనుగుణంగానే రెమ్యునరేషన్ తీసుకుంటారు. మహేష్ తో సినిమాలను తెరకెక్కించడానికి నిర్మాతలు కూడా చాలా ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మరికొన్ని రోజుల్లో విడుదల కానుండగా మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ త్వరలో మొదలుకానుంది.

Click Here To Watch NOW

మహేష్ జక్కన్న కాంబో మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు మహేష్ బాబుతో ఒక సినిమా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేజీఎఫ్2 సినిమా ద్వారా ఈ నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వచ్చాయి. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు భవిష్యత్తులో కూడా వరుసగా సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉండాలని భావిస్తున్నారు. అయితే కన్నడ నిర్మాతలకు మహేష్ బాబు ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.

మహేష్ వరుస ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కొత్త సినిమాలకు ఓకే చెప్పకపోవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ ప్రస్తుతం కెరీర్ కు ప్లస్ అయ్యే సినిమాలకు మాత్రమే ఓకే చెబుతున్నారు. మరోవైపు మహేష్ బాబుతో పని చేయాలని ఆశిస్తున్న నిర్మాతలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ 2025లో విడుదలవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూన్ నెల నుంచి రాజమౌళి ఈ సినిమాపై దృష్టి పెట్టనున్నారు.

మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబు కోసం ఇప్పటికే పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. రాజమౌళి టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని బోగట్టా.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus