Jai Hanuman: ప్రశాంత్ వర్మతో కన్నడ హీరో.. సెట్టయితే అరాచకమే..!

టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ సినిమాలు అందించిన దర్శకుల్లో ప్రశాంత్ వర్మ (Prasanth Varma)  ఒకరు. ఆయన రూపొందించిన హనుమాన్ (Hanuman) చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలై అన్ని ప్రాంతాల్లో మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కబోయే జై హనుమాన్ (Jai Hanuman) కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు వినిపిస్తున్న తాజా సమాచారం మాత్రం మరింత ఆసక్తికరంగా మారింది.

Jai Hanuman

లేటెస్ట్ టాక్ ప్రకారం జై హనుమాన్ సినిమాలో కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించనున్నట్లు తెలుస్తోంది. కాంతార వంటి చిత్రంతో డైరెక్టర్ గా తనదైన ముద్ర వేసుకున్న రిషబ్ శెట్టి, తన నటనతో దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకున్నాడు. ఇప్పుడు జై హనుమాన్ సినిమాలో ఆయన ప్రధాన పాత్రలో నటించబోతున్నాడన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

రిషబ్ శెట్టి హీరోగా సెట్టయితే ఈ ప్రాజెక్ట్ మరింత పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. రిషబ్ తన నటనలో ఉండే గ్రేస్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. పైగా, ఆయన కంటెంట్‌కు సబ్జెక్ట్‌కు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి కాబట్టి సినిమాలో మంచి కంటెంట్ ఉంటుందని చెప్పవచ్చు. మొదట జై హనుమాన్ కోసం రానా (Rana) ఫిక్స్ అయినట్లు టాక్ వచ్చింది.

కానీ అది నిజం కాదట. ప్రశాంత్ వర్మ ఇప్పుడు రిషబ్ శెట్టి పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ ఎప్పుడు ఇస్తారో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మించనున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ అయితే ఫిక్స్ అయినట్లు టాక్.

మహేష్ వల్ల రాజమౌళికి మంచి బేరం కుదిరిందిగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus