కే.జి.ఎఫ్(సిరీస్) తో కన్నడ సినిమాలకు కూడా ఆదరణ పెరిగింది. ఒకప్పుడు కన్నడ సినిమా అంటే పక్క భాషల్లోని సినిమాల్ని రీమేక్ చేసుకుంటారు అనే ముద్ర ఉండేది. వారికి ఆ వెసులుబాటు కూడా ఉండేది. అందుకోసం వారు రీమేక్ హక్కులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అయితే కే.జి.ఎఫ్ చిత్రం ఆ రూపురేఖల్ని మార్చేసింది. ఈ మధ్యనే విక్రాంత్ రోణ అనే చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
తాజాగా కాంతారా అనే మరో చిత్రం కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదల ముందు నుండే సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతో తెలుగులో థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :
నైజాం
0.55 cr
సీడెడ్
0.20 cr
ఉత్తరాంధ్ర
0.25 cr
ఈస్ట్
0.07 cr
వెస్ట్
0.06 cr
గుంటూరు
0.08 cr
కృష్ణా
0.08 cr
నెల్లూరు
0.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
1.35 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
1.65 cr (షేర్)
కాంతారా చిత్రానికి రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పక్కన చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ క్రేజ్ ఉన్న సినిమా ఇదొక్కటే కాబట్టి.. మంచి ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉంది.