Kantara: కాంతార ప్రీక్వెల్.. వెయ్యి కోట్లకు ఇదే బెస్ట్ ఛాన్స్!

రిషబ్ శెట్టి (Rishab Shetty) తెరకెక్కిస్తున్న కాంతార 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిన్న సినిమాగా మొదలైన కాంతార (Kantara) ఫస్ట్ పార్ట్, ప్రేక్షకుల ఆదరణతో పాన్ ఇండియా హిట్‌గా మారింది. ఇప్పుడు సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం, మరింత విస్తృతమైన కథాంశంతో వస్తోంది. ఊహించని విధంగా విడుదల తేదీల మార్పుతో ఈ సినిమాకు గోల్డెన్ ఛాన్స్ లభించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ నటించిన హై జవానీ తో ఇష్క్ హోనా హై అక్టోబర్ 2న విడుదల కావాల్సి ఉండగా, ఊహించని షెడ్యూల్ మార్పుతో వెనక్కి వెళ్లింది.

Kantara

ఈ మార్పుతో గాంధీ జయంతి స్పెషల్‌గా కాంతార 2 హిందీలో సింగిల్ రిలీజ్ అవుతోంది. దసరా సెలవులు కూడా కలిపి రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశం పెరిగింది. మొత్తంగా 1000 కోట్ల కలెక్షన్స్ కు ఇది మంచి టైమ్ అని చెప్పవచ్చు ఈ సినిమాకు అసలు బలం కథే. అడవి వాతావరణం, గ్రామీణ సంస్కృతి, దైవ భక్తిని మరింత బలంగా చూపించనున్నట్లు తెలుస్తోంది.

రిషబ్ శెట్టి తనదైన టేకింగ్‌తో కాంతార 2 ను మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నట్లు టాక్. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో కూడా హిట్ అవ్వడం వల్ల ఈసారి రిలీజ్ మరింత గ్రాండ్‌గా ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ మార్కెట్‌లో ప్రాచుర్యం పొందిన ఈ సినిమా, పోటీ లేకుండా విడుదల అవ్వడం అదృష్టం.

వచ్చే ఏడాది విడుదల కానున్న వార్ 2 తో దీనికి పోటీ ఉండొచ్చన్న వార్తలున్నా, టైమ్ గ్యాప్ ఉండటం వల్ల అంత ప్రభావం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద, బాక్సాఫీస్‌లో కాంతార 2 మరో సెన్సేషన్ సృష్టించేందుకు రెడీ అవుతోంది. 2025లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus