Nayanthara,Karan Johar: ఆ కామెంట్లపై వివరణ ఇచ్చిన కరణ్ జోహార్.. కానీ?

సౌత్ ఇండియాలో రెమ్యునరేషన్ విషయంలో టాప్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు నయనతార పేరు సమాధానంగా వినిపిస్తుందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారు. నయనతార డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ లో సగం కూడా మరే స్టార్ హీరోయిన్ తీసుకోవడం లేదు. రెమ్యునరేషన్ వల్లే చాలామంది స్టార్ హీరోలు నయనతారను తమ సినిమాలలో తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే సమంత గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ లో కరణ్ జోహార్ నయనతారను తక్కువ చేసి మాట్లాడారని సోషల్ మీడియా, వెబ్ మీడియాలో ప్రచారం జరిగింది.

సౌత్ ఇండియాలో నంబర్ వన్ హీరోయిన్ నువ్వే కదా అంటూ కరణ్ జోహార్ సామ్ ను అడగగా సామ్ మాత్రం సౌత్ ఇండియాలో నంబర్ వన్ హీరోయిన్ నయనతార అని తెలిపారు. ఆ తర్వాత కరణ్ జోహార్ మాత్రం ఆ పేరు నా జాబితాలో లేదని చెప్పుకొచ్చారు. తమిళనాడు రాష్ట్ర ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే హీరోయిన్లలో నయనతార ఒకరు. సినిమాల్లోకి నయనతార వచ్చి దాదాపుగా 17 సంవత్సరాలు అవుతున్నా ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు.

కరణ్ జోహార్ మాట్లాడుతూ నయనతారను కించపరచాలని నేను అనుకోలేదని వెల్లడించారు. ఫ్యాన్స్ నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఓరామ్యాక్స్ జాబితా అనుగుణంగా హీరోయిన్ల విషయంలో సమంత నంబర్ వన్ అని నేను చెప్పానని కరణ్ జోహర్ కామెంట్లు చేశారు. నేను నయనతారను తక్కువ చేసి మాట్లాడలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

కరణ్ జోహార్ ఎంత చెప్పినా ఆయనను మేము నమ్మబోమని నయనతార అభిమానులు చెబుతున్నారు. బోల్డ్ గా మాట్లాడకుండా కరణ్ జోహార్ ఉండాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరణ్ జోహార్ కామెంట్లపై నయనతార కూడా స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus